తమిళ సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్న అజిత్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అజిత్ ఇప్పటికే తాను నటించిన అనేక మూవీ లను తెలుగు భాషలో కూడా విడుదల చేసి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కూడా మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు . కొంత కాలం క్రితమే అజిత్ "వలిమై" మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు . ఈ మూవీ పాన్ ఇండియా మూవీ గా రూపొందింది . భారీ అంచనాల నడుమ తమిళ్ , తెలుగు , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదలైన ఈ మూవీ తమిళ్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నప్పటికీ , ఇతర భాషలలో మాత్రం ఈ మూవీ ప్రేక్షకులను పెద్దగా అలరించ లేక పోయింది . ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అజిత్ "తునివు" అనే భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు . 

హెచ్ వినోద్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ మూవీ ని వచ్చే సంవత్సరం పొంగల్ కారుకగా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ విడుదల తేదీని చిత్ర బృందం ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించలేదు. కాకపోతే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ ని వచ్చే సంవత్సరం జనవరి 11 వ తేదీన విడుదల చేసే అవకాశం స్పష్టంగా ఉన్నట్లు తెలుస్తుంది. అలాగే ఇందుకు సంబంధించిన అధికారిక  ప్రకటన కూడా మరి కొన్ని రోజుల్లో రాబోతున్నట్లు తెలుస్తుంది. ఈ మూవీ నుండి తాజాగా కొన్ని ఫోటోలు బయటకు వచ్చాయి. ఆ ఫోటోలలో అజిత్ అదిరిపోయే స్టైలిష్ లుక్ లో గన్ ను పట్టుకొని ఉన్నాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: