వచ్చేనెలలో జరగబోతున్న సంక్రాంతి రేస్ కు సంబంధించి దిల్ రాజ్ తన ‘వారసుడు’ డేట్ ను బాలయ్య ‘వీరసింహారెడ్డి’ డేట్ ను ప్రకటించినప్పటికీ ఈ రేసులో ముందు ఉంటుంది అని భావిస్తున్న ‘వాల్తేర్ వీరయ్య’ తన రిలీజ్ డేట్ ను ఇప్పటివరకు ఎందుకు ప్రకటించలేదు అంటూ ఇండస్ట్రీ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి. సంక్రాంతి రిలీజ్ లక్ష్యంగా ఈమూవీ తన షూటింగ్ ను పూర్తి చేసుకోవడానికి పరుగులు తీస్తోంది.


అయినప్పటికీ ఈమూవీ రిలీజ్ డేట్ ప్రకటన విషయంలో ఎందుకు ఆలస్యం అవుతోంది అంటూ మెగా అభిమానులు మధనపడుతున్నారు. ఈసినిమాకు సంబంధించి శృతి హాసన్ చిరంజీవి కలిసి ఉన్న పోష్టర్స్ కానీ అదేవిధంగా ఈసినిమాలో నటిస్తున్న మెయిన్ విలన్ కు సంబంధించిన పాత్ర పరిచయానికి సంబంధించిన పోష్టర్ కానీ ఇప్పటివరకు ఎందుకు విడుదల చేయలేదు అన్నది మెగా అభిమానుల మనసులోని ప్రశ్నలు.


ఈమూవీకి సంబంధించి ఇప్పటివరకు విడుదలైన ‘బాస్ పార్టీ సాంగ్’ కు స్పందన బాగానే వచ్చినప్పటికీ ఆతరువాత ఈమూవీ ప్రమోషన్ కు సంబంధించిన మెటీరియల్ ఏదీ బయటకు రావడంలేదు. ఇప్పుడు ఈ విషయమే మెగా అభిమానులలో అనేక ప్రశ్నలకు సందేహాలకు తావిస్తోంది. అయితే ఈవిషయంలో మరొకవాదన కూడ వినిపిస్తోంది. దసరా రేసులో విడుదలైన ‘గాడ్ ఫాదర్’ మూవీ ప్రమోషన్ ను కూడ చాల నెమ్మదిగా చేసారు. ఆ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ తరువాత వేగం పెంచారు.


దీనికితోడు ఆమూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో చిరంజీవి ఉద్వేగపూరితంగా చేసిన ఉపన్యాసం తరువాత ‘గాడ్ ఫాదర్’ మ్యానియా పెరిగింది. ఇప్పుడు అదే సీన్ ‘వాల్తేర్ వీరయ్య’ విషయంలో కూడ రిపీట్ అవుతుందా అంటూ మరికొందరు సందేహాలు వ్యక్త పరుస్తున్నారు. చిరంజీవి బాలకృష్ణ సంక్రాంతి వార్ కొన్ని దశాబ్దాల నుండి కొనసాగుతోంది. ఆవార్ లో కొన్నిసార్లు చిరంజీవి సక్సస్ అయితే మరికొన్ని సార్లు బాలయ్య సక్సస్ అందుకున్నాడు. అయితే ఎక్కువశాతం సక్సస్ లు బాలకృష్ణకు ఉండటంతో ఈ వార్ ఆశక్తిదాయకంగా మారింది..





మరింత సమాచారం తెలుసుకోండి: