
మహేష్ బాబు సినిమా షూటింగ్లలోకి వస్తే మహేష్ బాబు ఆ బాధ నుంచి బయటపడతాడు అని అభిమానులు ఆకాంక్షిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే డిసెంబర్ 8వ తేదీ నుంచి షూటింగ్ కూడా ప్రారంభం అవుతుందని ప్రకటించారు. ఎందుకో తెలియదు కానీ ఈ సినిమా షూటింగ్ ఇప్పుడే ప్రారంభం అయ్యేటట్లు కనిపించడం లేదు. ఈ సినిమా వచ్చే ఏడాది జూన్ కల్లా పూర్తి చేయాలని షరతులు త్రివిక్రమ్ పై ఉన్న విషయం తెలిసిందే. ఎందుకంటే మహేష్ బాబు తన తదుపరిచిత్రాన్ని రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. పాన్ ఇండియా సినిమా గా రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఆఫ్రికా అడవుల్లో యాక్షన్ ఎంటర్టైన్మెంట్ చిత్రంగా రాజమౌళి - మహేష్ బాబు కాంబోలో చిత్రం తెరకెక్కుతోంది అని.. తప్పకుండా మహేష్ బాబు కెరియర్ లోనే బెస్ట్ ఫిలిం గా నిలవబోతోంది అంటూ ఈ సినిమా రచయిత విజయేంద్ర ప్రసాద్ కూడా ఇప్పటికే హింట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా ఈ సినిమా నుంచి మరొక అప్డేట్ వైరల్ గా మారుతోంది.భారతదేశంలో ఉన్న ఒక ప్రముఖ హాలీవుడ్ స్టూడియో #SSMB 29 చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా పంపిణీ చేయడానికి సహకరించినట్లు సమాచారం. అందుకు సంబంధించిన చర్చలు కూడా జరుగుతున్నాయి. ఈ విషయం తెలిసి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.