టాలీవుడ్ ప్రముఖ హీరోలలో లవర్ బాయ్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న తరుణ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం పలు వ్యాపారాలతో బిజీగా ఉన్న తరుణ్ త్వరలోనే రీ ఎంట్రీ  ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది .ఆయన అభిమానులు ఎంతో ఎదురు చూస్తున్నారు .అయితే ఇటీవల మహేష్ మరియు త్రివిక్రమ్ కాంబినేషన్ లో రానున్న సినిమాల్లో తరుణ్ కూడా ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నారని వచ్చిన వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని తెలిసింది. లవర్ బాయ్ గా గుర్తింపు తెచ్చుకున్న తరుణ్ సెకండ్ ఇన్నింగ్స్ లో 

హీరోగా కెరియర్ ను కొనసాగిస్తారా లేక సినిమాల్లో కీలక పాత్రలకు ఓకే చెప్తారా అన్నది చూడాలి. ఇక ఆయనకి తగ్గ కథను ఏ డైరెక్టర్ సిద్ధం చేస్తారో చూడాలి. అయితే గతంలో ఈయన కదల ఎంపికలో చేసిన కొన్ని పొరపాట్ల  వల్ల కెరీర్లో అనేక ఇబ్బందులు పడ్డాడు. అయితే రీయంట్రిలో అయినా అలాంటి తప్పులు చేయకుండా సక్సెస్ సాధిస్తాడా అన్నది చూడాలి. మంచి కథలను ఎంపిక చేసుకున్నట్లయితే ఈ లవర్ బాయ్ క్రేజ్ మరింత పెరిగి అవకాశాలు అయితే ఉంటాయని చెప్పొచ్చు. సినిమాలలో రాణించలేకపోయినా తరుణ్ వ్యాపారాలతో బిజీగా ఉన్నారు.

అంతేకాదు అయిన వ్యాపారాల్లో ఊహించని స్థాయిలో సక్సెస్ అయ్యాడు. ఇక ఇది తెలిసిన మరికొందరు బిజినెస్ లో సక్సెస్ అయ్యాడు కాబట్టి సినిమాలల్లోకి రియంట్రీ ఇచ్చే అవకాశం లేదని అంటున్నారు .దీనికి సమాధానం తెలియాలి అంటే లవర్ బాయ్ మనసులో ఏముందో తెలియాల్సి ఉంది .మరికొందరైతే లవర్ బాయ్ ను వెండితెరపై మళ్ళీ చూడాలని తెగ ఆసక్తిగా ఉన్నారు. లవర్ బాయ్ గా సినీ ఇండస్ట్రీలో ఇప్పటికీ ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ అలాగే ఉంది .ఇక మరికొందరైతే సినిమాలలోకి రాకపోయినా కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండాలని కోరుకుంటున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: