టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరోలలో ఒకరు అయినటువంటి రామ్ పోతినేని గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. దేవదాస్ మూవీ తో వెండి తెరకు పరిచయం ఈ హీరో మొదటి మూవీ తోనే అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నాడు. ఆ తర్వాత అనేక విజయాలను టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్న ఈ హీరో ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ హీరో గా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ సంవత్సరం రామ్ పోతినేని "ది వారియర్" అనే పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. మంచి అంచనా నడుమ తెలుగు మరియు తమిళ భాషలలో విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది.

ఇలా ది వారియర్ మూవీ తో ప్రేక్షకులను నిరాశపరిచిన రామ్ పోతినేని ప్రస్తుతం టాలీవుడ్ మాస్ డైరెక్టర్ లలో ఒకరు అయినటు వంటి బోయపాటి శ్రీను దర్శకత్వం లో తెరకెక్కుతున్న మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీ గా రూపొందుతుంది. శ్రీ లీల ఈ మూవీ లో రామ్ పోతినేని సరసన హీరోయిన్ గా నటిస్తూ ఉండగా , ఊర్వశి రౌటేలా ఈ మూవీ లో స్పెషల్ సాంగ్ లో నటించబోతోంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ లో రామ్ పోతినేని ఒక రాజకీయ నాయకుడి వారసుడి పాత్రలో కనిపించబోతున్నట్లు ,  అలాగే రామ్ పోతినేనిమూవీ లో డ్యూయల్ రోల్ చేయబోతున్నట్లు , ఈ మూవీ లో రామ్ పోతినేని చేస్తున్న రెండు పాత్రలలో రెండు వేరియేషన్స్ ఉండబోతున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: