మాస్ మహారాజా రవితేజ గురించి ప్రత్యేకంగా తెలుగు చని ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం రవితేజ వరస మూవీ లతో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా రవితేజ ఇప్పటికే ఈ సంవత్సరం మొదటి గా ఖిలాడీ మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ ప్రేక్షకులను ఏ మాత్రం అలరించ లేక పోయింది. ఆ తర్వాత రవితేజ "రామారావు అన్ డ్యూటీ" అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇది ఇలా ఉంటే తాజాగా రవితేజ "ధమాకా" అనే రొమాంటిక్ మాస్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ లో పెళ్లి సందD బ్యూటీ శ్రీ లీల , రవితేజ సరసన హీరోయిన్ గ నటించగా , సినిమా చూపిస్త మామ , నేను లోకల్ , హలో గురు ప్రేమ కోసమే మూవీ లకు దర్శకత్వం వహించిన త్రినాధరావు నక్కిన ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు.

డిసెంబర్  23 వ తేదీన ధమాకా మూవీ ని థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ యూనిట్ ఈ సినిమా నుండి కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేసింది. వాటికి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. ఇది ఇలా ఉంటే తాజాగా ధమాకా మూవీ యూనిట్ ఈ సినిమా రన్ టైమ్ ను లాక్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ధమాకా మూవీ రన్ టైమ్ ను మూవీ యూనిట్ 2 గంటల 10 నిమిషాలకు ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఇలా చాలా మామూలు నిడివి తో డమాకా మూవీ ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తుంది. ఈ మూవీ పై మాస్ మహారాజా రవితేజ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: