ఆక్టర్  ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న విషయం  మనకి తెలిసిందే. అయితే ఈ సినిమా పాతబడ్డ రాజా డీలక్స్ అనే థియేటర్ బ్యాక్ డ్రాప్ లో సాగే తాతా మనవళ్ల కథ అని తెలుస్తోంది మరీ.

ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఇక త్వరలో రెండో షెడ్యూల్ ప్రారంభించనున్నారు. హారర్‌ కామెడీ జానర్‌లో రూపొందనున్న ఈ సినిమా షూటింగ్‌లో ప్రభాస్‌ త్వరలోనే జాయిన్‌ కానున్నారు అంటా.

పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇదిలా ఉంటే చిత్రంలో ఒకప్పటి స్టార్ హీరోయిన్ ప్రభాస్ అక్కగా నటిస్తోందని తెలుస్తోంది. ఒకప్పటి ముద్దుగుమ్మలు ప్రస్తుతం సెకండ్ ఇన్సింగ్స్ స్టార్ట్ చేశారు. ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో హీరోలకు వదినలుగా, అక్కలుగా తమదైన స్టైల్ లో పాత్రలు చేస్తూ రాణిస్తున్నారు. అదే లిస్టులోకి ఎంటర్ అయింది అందాల భూమిక. ఇప్పటికే సెకండ్ ఇన్సింగ్స్ స్టార్ట్ చేసిన ఈ ముద్దు గుమ్మ.. త్వరలోనే ప్రభాస్ అక్కగా నటించనుందని  అందరూ అనుకుంటున్నారు.

నానికి వదినగా మిడిల్ క్లాస్ అబ్బాయిలో నటించగా.. ప్రేక్షకుల నుంచి మంచి మార్కులే కొట్టేసింది భూమిక అని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు మాత్రం నెటిజన్స్ ఇదేం కాంబో రా బాబు అంటున్నారు. ప్రభాస్ కి అక్క అంటే... ప్రభాస్ హైట్ కి, వెయిట్ కు ఈ హీరోయిన్ అస్సలు మ్యాచ్ అవదు అని పెదవి విరుస్తున్నారు. బాహుబలి ముందు భూమిక ఉడతలా ఉంటుందని కామెంట్స్ చేస్తున్నారు. ఇది మాత్రం ప్రభాస్ సినిమాకు మైనస్ అవుతుందని అందరూ అంటున్నారు.

అసలే ప్రభాస్ కు బాహుబలి తర్వాత ఆ రేంజ్ లో సినిమా అస్సలు పడలేదు. సాహో ఎన్నో అంచనాల మధ్య విడుదలై విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ తర్వాత ప్యూర్ లవ్ స్టోరీతో ఎంటర్ టైన్ చేస్తాడు అనుకున్న ప్రభాస్.. రాధేశ్యామ్ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడింది. ఈ సినిమాలో ప్రభాస్ , పూజా జోడిపై కూడా విమర్శలు  బాగానే వచ్చాయి. కాగా ప్రస్తుతం ప్రభాస్ సలార్ అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్నారు. ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఏ మేరకు ఆకట్టుకుంటుందో మనం వేచి చూడాలి మరీ. ఇక ఓం రౌత్ తెరకెక్కించిన ఆదిపురుష్ కూడా త్వరలో రిలీజ్ కానుంది. ఇటీవల విడుదలైన టీజర్ పై ప్రేక్షకుల నుంచి విమర్శలు వచ్చాయి. ఈసారైనా ప్రభాస్ కి మంచి హిట్ పడితే అంతే చాలు అని ప్రేక్షకులు అందరూ అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: