పుష్ప సినిమా ఎంత పాపులారిటీని దక్కించుకుందో ఆ సినిమాలో స్టార్ హీరోయిన్ సమంత నర్తించిన "ఉ అంటావా మావ ఉ ఊ అంటావా మావ" పాట ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే. ఇప్పటికి ఈ పాట క్రేజ్ ఇంకా తగ్గలేదని చెప్పాలి.. ఈ పాటతో పాన్ ఇండియా రేంజ్ లో సమంత కూడా గుర్తింపు తెచ్చుకుంది. అంతే కాదు సమంత మొదటిసారి నటించిన ఐటమ్ సాంగ్ కూడా ఇదే కావడం గమనార్హం. ఇకపోతే ఈ సినిమా ఎంత పాపులారిటీని దక్కించుకుందో ఈ సినిమాలో పాట.. ఆ పాట పాడిన అమ్మాయి కూడా అంతే గుర్తింపు తెచ్చుకుంది. ఆమె ఎవరో కాదు ప్రముఖ ఫోక్ సింగర్ మంగ్లీ చెల్లెలు..


ఆమె ఎవరో కాదు ఇంద్రావతి చౌహాన్.. ఒక్కొక్క భాషలో ఈ పాటను ఒక్కొక్క సింగర్ పాడిన విషయం తెలిసిందే.  ఈ క్రమంలోని తెలుగులో ఇంద్రావతి చౌహన్ తన అద్భుతమైన గాత్రంతో ప్రేక్షకులను మత్తెక్కించింది. పాటకు తగ్గ ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ప్రేక్షకులను అలరించిన ఈ ముద్దుగుమ్మకు ప్రతి ఒక్కరు ఫిదా అయిపోయారు.  దీంతో ఒక్క పాటతోనే ఓవర్ నైట్ లోనే స్టార్ సింగర్ స్టేటస్ ను సొంతం చేసుకుంది ఇంద్రావతి చౌహన్. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పుడు ఈమె మరొక భాష ఇండస్ట్రీలో అవకాశం దక్కించుకుందని సమాచారం.

తాజాగా ఇంద్రావతి చౌహన్ తమిళంలో గాయనిగా అరంగేట్రం చేయనుంది అని వార్తలు వినిపిస్తున్నాయి.  అయితే ఏ సినిమా ద్వారా ఏ పాట ద్వారా తన ఉనికిని చాటుకోబోతోంది అనే విషయంపై ఇంకా స్పష్టత లేదు. త్వరలోనే అన్ని విషయాలు కూడా స్పష్టం చేస్తాము అని ఇంద్రావతి చౌహన్ సన్నిహితులు వెల్లడిస్తున్నారు. ఇకపోతే ఒక పాటతోనే ఓవర్ నైట్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఇంద్రావతి చౌహన్ అక్కకు తగ్గట్టుగానే పేరు సంపాదించుకుంటుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: