ప్రస్తుతం ఉన్న హీరోయిన్లలో చాలామందికి యాక్టింగ్ రాదని విమర్శలు బాగా వినిపిస్తున్నాయి. కొన్ని సినిమాలు చూస్తే అది నిజమే అనిపిస్తుంది.
బ్లాక్ అండ్ వైట్ సినిమాలలో సావిత్రి, జమున, అంజలీదేవి లాంటివారు ఎంత అద్భుతంగా నటించా రో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ తర్వాత వచ్చిన విజయశాంతి, రాధ, సుహాసిని, సుమలత, భానుప్రియ లాంటి హీరోయిన్స్ తమ నటనతో మంచి స్టార్ డమ్ ను సంపాదించుకున్నారు. ఇక తర్వాత తరం లో సౌందర్య రమ్యకృష్ణ,

రంభ, రాశి, సిమ్రాన్, సంఘవి, మీనా, రోజా లాంటి హీరోయిన్స్ కూడా అదరగొట్టారు. కానీ ఇప్పుడు వచ్చిన హీరోయిన్స్ మాత్రం అందచందా లతో మాత్రమే నెట్టు కొస్తున్నారు. సమంత, కీర్తి సురేష్, నయనతార, త్రిష, తమన్నా, రష్మిక మందన, పూజా హెగ్డే బాగా పెర్ఫార్మెన్స్ చేస్తున్నప్పటి కీ ఇంకా ఎక్కడో జనాలను మెప్పించ లేకపోతున్నారు. ఇప్పుడు వీరందరికి పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ ఉంది. అయితే కొందరు హీరో యిన్స్ మాత్రం రొమాంటిక్ హీరోయిన్స్ గా ఫిక్స్ అయిపోతున్నారు. నటన అనేది వీరిలో చాలా తక్కువగా కనిపిస్తోంది.
విజయ్ దేవరకొండ కు జోడిగా అర్జున్ రెడ్డి సినిమాలో నటించైన శాలిని ఇప్పుడు అడ్రస్ లేదు ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఆమెకు ఛాన్సులు రావడం లేదు. ఇక పాయల్ రాజ్ పుత్ కూడా అలానే ఉంది. నిధి అగర్వాల్ నభా నటేష్ ల పరిస్థితి కూడా అలానే ఉంది. ఈ తరం హీరోయిన్స్ కొందరు చాన్సుల కోసం యాక్టింగ్ రాకపో యినా మేకర్స్ కి రెమ్యూన రేషన్ విషయం లో వెసులుబాటు చూపించి సినిమానిండా ఎన్ని లిప్ కిస్ లు ఉన్న రొమాం టిక్ సీన్స్ ఉన్న ఓకే అని చెప్పేసి అవకాశాలు పట్టేస్తు న్నారు. కానీ వీరు ఎక్కువ గా కాలం ఇండస్ట్రీలో హీరోయి న్గా కొనసాగడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: