నిఖిల్ సిద్ధార్థ్ మరియు అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న సినిమా 18 పేజీస్ .ఈ సినిమాను పిక్చర్స్ సంయుక్తంగా తలకెక్కిస్తున్నారు .కాగా  ఈ సినిమాని బన్నీ వాసు నిర్మిస్తుండగా.. మెఘనిర్మాతా అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. అయితే ఈ సినిమాకి ఫ్యాన్ ఇండియా డైరెక్టర్ సుకుమార్ కథను అందించారు. ఇక సూర్య ప్రతాప్ పల్నాటి దర్శకత్వం వహించిన ఈ సినిమాని డిసెంబర్ 23న విడుదల చేయనున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ఈ సినిమాలోని ఏడు రంగుల వాన పాటను చిత్ర బృందం ఆదివారం విడుదల చేశారు. శ్రీమణి రాసిన సాహిత్యం అందించగా సైద్ శ్రీరామ్ ఆలపించిన ఈ పాటలను అగ్ర నిర్మాత అల్లు అరవింద్ రిలీజ్ చేశారు.

దీని అనంతరం అల్లు అరవింద్ మాట్లాడుతూ చిత్ర బృందానికి నా అభినందనలు ...ఈ సందర్భంగా ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన అనుపమ పరమేశ్వరన్ పై ఆసక్తికర వ్యాఖ్యలను చేశారు అల్లు అరవింద్ .అయితే ఈ మేరకు అల్లు అరవింద్ మాట్లాడుతూ అనుపమ గురించి మాట్లాడకుండా నేను ఉండలేకపోతున్నాను.తనని చూస్తే చాలు నాకు  కూడా ఇలాంటి కూతురు ఉంటే బావుండు అని ఎప్పుడూ అనిపిస్తుంది. అంత మంచి అమ్మాయి ఈమె. అంతే కాదు తనలో ఎలాంటి నటన ఉండదు అనుపమ చాలా ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది .అనుపమ మనసులో ఏది దాచుకోదు .ఏది ఉంటే అది మొహం మీదే మాట్లాడుతుంది.

అంతేకాదు ఇలాంటి వారు చాలా అరుదుగా ఉంటారు. అందుకే నాకు అనుపమంటే చాలా ఇష్టం అంటూ చెప్పుకోవచ్చాడు అల్లు అరవింద్. ఇందులో భాగంగా నిఖిల్ గురించి మాట్లాడుతూ నిఖిల్ చాలా అంకిత భావంతో పనిచేస్తాడు అంటూ ప్రశంసించాడు అల్లు అరవింద్. దీంతో అనుపమ పరమేశ్వరన్ పై అల్లు అరవింద్ చేసిన ఈ వ్యాఖ్యలు కాస్త సోషల్ మీడియా వేదికగా వైరల్ గా మారాయి. ఇక డిసెంబర్ 23న విడుదల కాబోయే 18 పేజీ సినిమా కోసం నిఖిల్ సిద్ధార్థ మరియు అనుపమ పరమేశ్వరన్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: