ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో వరుస మూవీ లతో ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్న ముద్దు గుమ్మ లలో ఒకరు అయినటు వంటి అనుపమ పరమేశ్వరన్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ మలయాళ సినిమాల ద్వారా మంచి గుర్తింపును తెచ్చుకొని , ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ లలో ఒకరిగా కెరియర్ కొనసాగిస్తుంది. ఇప్పటికే అనుపమ పరమేశ్వరన్ ఈ సంవత్సరం రౌడీ బాయ్స్  అంటే సుందరానికి ,  కార్తికేయ 2 మూవీ లతో ప్రేక్షకులను పలకరించింది. అలాగే మరి కొన్ని రోజుల్లో 18 పేజెస్ అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించడానికి రెడీ గా ఉంది. 18 పేజెస్ మూవీ డిసెంబర్ 23 వ తేదీన భారీ ఎత్తున థియేటర్ లలో విడుదల కాబోతుంది.

ఇది ఇలా ఉంటే అనుపమ పరమేశ్వరన్ బటర్ ఫ్లై అనే ఓ మూవీ లో కూడా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ చాలా రోజుల నుండి పెండింగ్ లో ఉంది. అయితే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఒక అదిరిపోయే అప్డేట్ ను ఈ మూవీ యూనిట్ విడుదల చేసింది. ఈ మూవీ యూనిట్ ఈ సినిమాను థియేటర్ లలో కాకుండా నేరుగా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మూవీ ని ఈ సంవత్సరం డిసెంబర్ 29 వ తేదీ నుండి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ "ఓ టి టి" లో ఫ్లాట్ ఫామ్ స్ట్రీమింగ్ చేయనున్నట్లు తాజాగా ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఘంటా సతీష్ బాబు రచన, దర్శకత్వం వహించిన ఈ మూవీ లో నిహాల్ కొదటి కథానాయకుడిగా నటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: