బుల్లితెరపై ప్రసారమవుతున్న రియాల్టీ షో లలో అతిపెద్ద షో గా మంచి గుర్తింపును తెచ్చుకున్న బిగ్ బాస్ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ షో మొదటి సీజన్ అంతగా ఆకట్టుకోలేకపోయినప్పటికీ దాని తరువాత నుండి ఈ షోను అందరూ చూడడం మొదలుపెట్టారు .నెమ్మదిగా ఈ షో కి చాలామంది అట్రాక్ట్ అవుతున్నారు అని చెప్పాలి. దీంతో బుల్లితెర మీదనే టాప్ రేటింగ్ లో దూసుకుపోతుంది ఈ షో. అయితే ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 6 ప్రసారమవుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలోనే 14వ వారం లో అనూహ్యంగా ఎవరు ఊహించిన విధంగా ఇనాయా ఎలిమినేట్ అయ్యింది.

ఇక ఈమె టాప్ 2 లో రేవంత్ కి పోటీగా ఉంటుంది అనే వార్తలు వచ్చినప్పటికీ ఎవరు ఊహించని విధంగా ఈమె ఎలిమినేట్ అయ్యింది. ఇలా ఎలిమినేట్ అవ్వడం ఎవరికీ నచ్చలేదు. ఎలిమినేషన్ లో బిగ్ బాస్ మోసం చేశాడు అనే వార్తలు సైతం వచ్చాయి. అయితే ఈ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఇనాయ మొదటి రెండు మూడు వారాలు నెమ్మదిగా ఉన్నప్పటికీ దాని అనంతరం గేమ్ మొదలు పెట్టింది .దాంతో ఈమె గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది. దాంతో చాలామంది ఈమె మీద చాలా నమ్మకంతో టైటిల్ విన్ అవుతుంది అని అనుకున్నారు. అప్పటినుండి తన పర్ఫామెన్స్ చూపిస్తూ హౌస్ లో స్ట్రాంగ్  లేడీ కంటస్టెంట్ గా పేరు తెచ్చుకుంది ఈమె. 

దాని అనంతరం ఫ్యామిలీ వీక్ తర్వాత ఈమె కాస్త స్లో అయ్యింది అని చెప్పాలి. ఇంట్లో వాళ్ళతో మంచి పేరు తెచ్చుకోవాలి అనే ఉద్దేశంతో గేమ్ మీద దృష్టి పెట్టకుండా ఆడింది అనే వార్తలు సైతం వచ్చాయి .దీంతోపాటు ఆర్జీవి కూడా తన సినిమాల మీద దృష్టి పెట్టి ఇనాయ మీద కాన్సెంట్రేట్ చేయలేదు. దీంతో ఇనాయాకు ఓట్లు పడలేదు అంటూ సోషల్ మీడియా వేదికగా వార్తలు వినిపిస్తున్నాయి .అయితే వర్మ సపోర్ట్ చేయకపోవడం వల్ల ఇనాయ ఎలిమినేట్ అయ్యింది అని వార్తలు సైతం వినిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ ఇనాయ హౌస్ లో నుండి ఎలిమినేట్ అవ్వడంతో ఆమె అభిమానులు ఎంతో నిరాశకు గురయ్యారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: