తమిళ సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన హీరోలలో ఒకరు అయినటు వంటి విశాల్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. విశాల్ ఇప్పటికే తాను నటించిన అనేక మూవీ లను తెలుగు లో కూడా విడుదల చేసి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కూడా మంచి గుర్తింపును దక్కించుకున్నాడు. విశాల్ నటించిన మూవీ లలో పందెం కోడి మూవీ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ బ్లాక్ బాస్టర్ విజయం అందుకుంది. ఈ మూవీ తో విశాల్ కు తెలుగు నాట మంచి గుర్తింపు లభించింది. ఆఖరుగా విశాల్ సామాన్యుడు అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు.

డింపుల్ హయాతి ఈ మూవీ లో విశాల్ సరసన హీరోయిన్ గా నటించింది. పర్వాలేదు అనే రేంజ్ అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇది ఇలా ఉంటే తాజాగా విశాల్ "లాఠీ" అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ లో హీరో గా నటించాడు.  ఏ వినోద్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ కి యువన్ శంకర్ రాజా సంగీతం అందించాడు. ఈ మూవీ ని డిసెంబర్ 22 వ తేదీన తమిళ , తెలుగు , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేసింది. ఈ సినిమా ట్రైలర్ లో యాక్షన్ సన్నివేశాలు అద్భుతంగా ఉండడం , విశాల్ నటన కూడా కూడా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండడంతో ఈ మూవీ ట్రైలర్ కు తెలుగు సినీ ప్రేమికుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: