తెలుగు లో అత్యంత ప్రజాధరణ పొందిన రియాల్టీ షో లలో ఒకటి అయినటువంటి బిగ్ బాస్ రియాల్టీ షో గురించి బుల్లి తెర ప్రేమికులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మొదట భారతదేశంలో హిందీ లో ప్రసారం అయిన బిగ్ బాస్ రియాల్టీ షో ను ఆ తర్వాత ఇండియా లోని చాలా భాషలలో ప్రసారం చేస్తున్నారు. అందులో భాగంగా తెలుగు లో కూడా బిగ్ బాస్ రియాల్టీ షో ప్రసారం అవుతుంది. ఇప్పటికే తెలుగు లో బిగ్ బాస్ రియాల్టీ షో 6 వ సీజన్ కొనసాగుతుంది. అలాగే బిగ్ బాస్ "ఓ టి టి" నాన్ స్టాప్ కూడా ఒక సీజన్ కంప్లీట్ అయింది.  బిగ్ బస్ తెలుగు మొదటి సీజన్ కు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించగా ,  రెండవ సీజన్ కు న్యాచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరించాడు.

ఆ తర్వాత మూడవ , నాలుగవ ,  ఐదవ మరియు ప్రస్తుతం ప్రసారం అవుతున్న ఆరవ సీజన్ కు టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరించాడు. అలాగే బిగ్ బాస్ "ఓ టి టి" నాన్ స్టాప్ కి కూడా అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరించాడు. నాగార్జున బిగ్ బాస్ రియాల్టీ షో ద్వారా అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం బిగ్ బాస్ 6 సీజన్ ఎండింగ్ దశకు చేరుకుంది. మరికొన్ని రోజుల్లోనే బిగ్ బాస్ 6 వ సీజన్ ఇది పూర్తి కాబోతుంది. ఆ తర్వాత 7 వ సీజన్ కూడా మరి కొంత కాలంలో ప్రారంభం కాబోతోంది. ఈ  7 వ సీజన్ కు నాగార్జున కాకుండా మరో హోస్ట్ ను తీసుకునే ఆలోచనలో బిగ్ బాస్ నిర్వాహక బృందం ఉన్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: