బాలీవుడ్ లో కొన్ని సినిమాలు చేసినా రాని గుర్తింపు మరియు ఫేమ్ అంతా ఒక్క సినిమాతో సొంతం చేసుకుంది మరాఠీ భామ మృణాళిని ఠాకూర్. టాలీవుడ్ లో మంచి అభిరుచి ఉన్న దర్శకుడిగా పేరు తెచ్చుకున్న హను రాఘవపూడి ఫలితంతో సంబంధం లేకుండా కొత్త కథలను మంచి ఎమోషన్ లను రంగరించి మన ముందుకు వస్తూ ఉంటాడు. ఇతని డైరెక్షన్ లో మొన్నటి వరకు అందాల రాక్షసి, కృష్ణగాడివీర ప్రేమగాథ, లై మరియు పడి పడి లేచే మనసు లు తెరకెక్కాయి. వీటి తర్వాత 4 సంవత్సరాల గ్యాప్ తీసుకుని హృదయాన్ని హత్తుకునే మరొక అందమైన ప్రేమకథతో ఈ మధ్యనే మన ముందుకు "సీతారామం" తో వచ్చాడు .

ఇందులో హీరోగా మలయాళ యంగ్ సెన్సేషన్ దుల్కర్ సల్మాన్ మరియు హీరోయిన్ గా మృణాళిని ఠాకూర్ నటించారు. మిగిలిన పాత్రలలో రస్మిక మందన్న , తరుణ్ భాస్కర్ , సుమంత్ లు నటించి మెప్పించారు. ఈ సినిమా ఎటువంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది, టోటల్ 2022 లోనే ఉత్తమ చిత్రాలలో ఒకటిగా పేరు తెచ్చుకుంది. ఈ సినిమాలో ఒక సన్నివేశాన్ని కూడా బాగోలేదు అని చెప్పడానికి లేకుండా దిరెచ్తిఒన్ మరియు స్క్రీన్ ప్లే ఉంది. ఈ సినిమాతో మరోసారి హను రాఘవపూడి టాలీవుడ్ లోని ప్రముఖ నిర్మాతల మదిని తట్టిలేపాడు. ఇందులో రామ్ మరియు సీతలుగా వారి నటనను ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది.

దుల్కర్ సల్మాన్ ఎలాగు నటుడిగా తానేమిటో ప్రూవ్ చేసుకున్నాడు.. కానీ మృణాళిని ఠాకూర్ కు ఇది తన కెరీర్ ను మలుపు తిప్పే సినిమాగా చెప్పుకోవాలి. ఈ సినిమా తర్వాత తాను వరుస సినిమాలతో బిజీ హీరోయిన్ గా అవుతుందని అందరూ ఊహించారు.. కానీ అనుకున్న విధంగా ప్రస్తుతం మృణాళిని చేతిలో ప్రాజెక్టులు ఏమీ లేవట. తెలుస్తున్న సమాచారం ప్రకారం ఒక హిట్ తర్వాత కొన్ని ఆఫర్స్ రావడం సహజం. లాగానే ఎలాంటి కథలను అయినా ఓకే చేయడం మంచిది కాదని.. ప్రేక్షకులకు నచ్చే పాత్రలనే ఎంచుకుని ప్రాజెక్ట్ ఓకే చేస్తానని చెబుతోందట. మరి చూద్దాం నెక్స్ట్ మన సీత నుండి ఎలాంటి సినిమా రానుందో ?  

మరింత సమాచారం తెలుసుకోండి: