మోస్ట్ బ్యూటిఫుల్ మోస్ట్ గార్జియస్ హీరోయిన్ లలో ఒకరు అయినటువంటి శ్రీ లీల గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ శ్రీకాంత్ కుమారుడు రోషన్ హీరో గా తేరకెక్కిన పెళ్లి సందD మూవీ ద్వారా తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మామూలు విజయం సాధించినప్పటికీ , ఈ మూవీ లో శ్రీ లీల తన అంద చందాలతో , డ్యాన్స్ తో కుర్రకారును ఫిదా చేయడంతో ఈ మూవీ ద్వారా ఈ ముద్దు గుమ్మ కు అదిరిపోయే గుర్తింపు లభించింది. దానితో ప్రస్తుతం శ్రీ లీల కు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అదిరిపోయే క్రేజీ సినిమా అవకాశాలు లభిస్తున్నాయి. ప్రస్తుతం ఈ ముద్దు గుమ్మ రామ్ పోతినేని హీరో గా బోయపాటి శ్రీను దర్శకత్వం లో తెరకెక్కుతున్న మూవీ లో హీరోయిన్ గా నటిస్తోంది.

మూవీ భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీ గా రూపొందుతుంది. అలాగే ఈ ముద్దు గుమ్మ ఇప్పటికే మాస్ మహారాజా రవితేజ హీరోగా త్రినాధరావు నక్కిన దర్శకత్వం లో తెరకెక్కిన ధమాకా అనే రొమాంటిక్ కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ డిసెంబర్ 23 వ తేదీన థియేటర్ లలో విడుదల కాబోతోంది. అలాగే మహేష్ బాబు , త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కబోయే మూవీ లో కూడా ఈ ముద్దు గుమ్మ కు అవకాశం లభించినట్లు తెలుస్తోంది. ఇలా వరుస మూవీ అవకాశాలతో ఫుల్ జోష్ లో దూసుకుపోతున్న ఈ ముద్దు గుమ్మ ప్రస్తుతం ముంబై లో ఎంబిబిఎస్ ఫైనల్ ఎగ్జామ్స్ రాస్తుంది  ఈ ఎగ్జామ్స్ తర్వాత ఈ ముద్దు గుమ్మ ధమాకా మూవీ ప్రమోషన్ లలో పాల్గొనే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: