హీరోయిన్ అంజలి ఒక హీరోని నమ్మి మోసపోయాను చెప్పడం  బాగా హాట్ టాపిక్ గా మారింది,ఆమె నేరుగా ఆరోపణలు చేయడం సంచలనమైంది. తెలుగు అమ్మాయి అంజలి వరుసగా డిజిటల్ సిరీస్లు చేస్తున్నారు.

ఆమె ప్రధాన పాత్రలో తెరకెక్కిన సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ ఝాన్సీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది. ఝాన్సీ సిరీస్ ప్రశంసలు దక్కించుకుంది. వెంటనే అంజలి మరో థ్రిల్లింగ్ సిరీస్ తో ప్రేక్షకులను పలకరించారు

అంజలి లీడ్ రోల్ చేసిన 'ఫాల్' అనే వెబ్ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో అందుబాటులోకి వచ్చింది అని మనకి తెలిసిందే. డిసెంబర్ 9 నుండి ఈ సిరీస్ స్ట్రీమ్ అవుతుంది. సిద్ధార్థ్ రామస్వామి ఫాల్ సిరీస్ దర్శకుడిగా ఉన్నారు. ఫాల్ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో పాల్గొన్న అంజలి పలు విషయాలపై స్పందించారు.ప్రచారం అవుతున్న పుకార్లకు పై క్లారిటీ ఇచ్చారు. ముఖ్యంగా ఆమె పెళ్లి వార్తలను ఖండించారు. అమెరికాలో ఉంటున్న ఇండియన్ ని అంజలి వివాహం చేసుకున్నారని వస్తున్న వార్తల్లో నిజం  అస్సలు లేదని  అమే వెల్లడించారు.

ప్రతిసారి నా పెళ్లి విషయంలో నిరాధార కథనాలు ప్రచారం చేస్తున్నారు. నాకు ఇప్పట్లో వివాహం చేసుకునే ఆలోచన అస్సలు లేదు అని నటి పేర్కొన్నారు. ఆ సమయం వచ్చినప్పుడు కచ్చితంగా అందరికీ చెబుతాను. దయచేసి ఇలాంటి పుకార్లు ప్రచారం చేయకండని అంజలి అన్నారు. అయితే ఒక హీరో తనను నమ్మించి మోసం చేశాడని అంజలి చెప్పడంతో మీడియా ప్రతినిధులు అందరూ షాక్ అయ్యారు. గతంలో నేను ఒక వ్యక్తిని ప్రేమించాను. అతన్ని పూర్తిగా నమ్మాను. తను మాత్రం నన్ను మోసం చేశాడు.
అదొక విషపూరిత బంధం. నేను ప్రేమించిన ఆ వ్యక్తి ఎవరనేది నేను  ఎప్పుడూ చెప్పను. ఎందుకంటే మాది ముగిసిన బంధం, వివరాలు అనవసరం మీకు, ఆనాటి సంగతులు గుర్తు చేసుకోవడం కూడా నాకు ఇష్టం లేదు, అని అంజలి తెలియజేశారు. జర్నీ మూవీలో తనతో జతకట్టిన హీరో జై తో అంజలి సీరియస్ రిలేషన్ నడిపారని కోలీవుడ్ మీడియాలో బాగానే కథనాలు వెలువడ్డాయి. కొన్నాళ్ల తర్వాత వీరిద్దరూ బ్రేకప్ అయ్యారు. అంజలికి తెలియకుండా మరో నటికి జై దగ్గరయ్యాడని, తెలియడంతో దూరం పెట్టిందట. అంజలి చెప్పిన ఆ మోసగాడు జై కావచ్చు అని కొందరి అంచనా. జై తో రిలేషన్ పై కూడా అంజలి స్పందించారు. నాకు పరిశ్రమలో చాలా మంది మిత్రులు ఉన్నారు . వారిలో జై కూడా ఒకరు. అంతకు మించి మా మధ్య ఏమీ లేదని ఆమె  ఇలా చెప్పుకొచ్చారు

మరింత సమాచారం తెలుసుకోండి: