మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న తాజా సినిమా వాల్తేరు వీరయ్య. రోజు రోజుకి ఈ సినిమాపై అభిమానుల్లో మరియు ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగిపోతున్నాయి. అయితే ఇప్పటివరకు విడుదలైన రవితేజ మరియు చిరంజీవి స్పెషల్ టీజర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అంతేకాదు దేవిశ్రీప్రసాద్ సంగీతం సమకూర్చిన బాస్ పార్టీ సాంగ్ సెన్సేషన్ చాట్ బస్టర్ సాంగ్ గా నిలిచింది. ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా ఈ పాటే వినిపిస్తుంది. ఈ సినిమాకి సంబంధించి ఇప్పటివరకు విడుదలైన కంటెంట్ మొత్తం సినిమాపై పాజిటివ్ బస్ ని ఏర్పరుస్తోంది.

ప్రీ రిలీజ్ కూడా 100 కోట్ల రూపాయలకు పైగా జరిగిందని తెలుస్తుంది. చిరంజీవికి జోడిగా శృతిహాసన్ నటించిన ఈ సినిమా జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇక చిరంజీవి నటించిన గత రెండు సినిమాలు కూడా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయాయి. దీంతో ఈ సినిమాతో అయినా బ్లాక్ బస్టర్ హిట్ ను  కొట్టాలని ఆయన అభిమానులు వెయిట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో చిరంజీవి మరియు రవితేజ సవతి అన్నదమ్ములుగా నటిస్తారన్న సంగతి తెలిసిందే. రవితేజ ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో మరియు మెగాస్టార్ చిరంజీవి దందాలు మరియు సెటిల్మెంట్స్ చేసే ఒక మాస్ పాత్రలో అలరించనున్నారు.

అయితే సినిమా మొత్తం కూడా చిరంజీవి మరియు రవితేజ మధ్య గొడవలే ఉంటాయని ఇంటర్వెల్ సన్నివేశంలో ఒకరిపై ఒకరు తలపడతారని అంతే కాదు ఈ సినిమాలో చిరంజీవిని రవితేజ ఒక సన్నివేశంలో అరెస్ట్ చేస్తాడని మెగాస్టార్ ని రవితేజ అరెస్ట్ చేసి జైలుకి కూడా తీసుకెళ్తారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమా డైరెక్టర్ బావి movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ వారి సోషల్ మీడియా వేదికగా ఇలా చెప్పకు వచ్చారు... అభిమానులందరూ రాసి పెట్టుకోండి ఈ సన్నివేశం సినిమాకి హైలైట్ గా నిలుస్తుంది. ఫ్యాన్స్ కి పూనకాలే అని చెప్పుకొచ్చారు. ఇక చిరంజీవి అభిమానులు ఆయనని ఎంత మాస్ గా  చూడాలనుకున్నారో అంతకుమించి మాస్గా ఈ సినిమాలో కనబడతాడటంట. దీంతో ఈ వార్త కాస్త ఇప్పుడు వైరల్ అవుతుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: