ఎన్టీఆర్ మరియు కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కబోయే  సినిమాలో...ఎన్టీఆర్ కి జోడిగా  నటించే హీరోయిన్ కి సంబంధించి గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా వేదికగా అనేక వార్తలు వస్తున్నాయి. ఇక ఈ సినిమాలో ఆలియా భట్ నుండి శ్రీ లీల వరకు ఈ సినిమాలో ఎన్టీఆర్ కి జోడిగా అందరూ హీరోయిన్ల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. ఇక ఈ మధ్య తారక్ కి జోడిగా జాన్వి కపూర్ దాదాపు ఫిక్స్ అయ్యారని వార్తలు వినబడుతున్నాయి. అయితే జాన్వి కపూర్ ఈ సినిమాకు ఫైనల్ అయినా కూడా  ఇందులో ఒక ట్విస్ట్ ఉందట. అయితే ఎన్టీఆర్ సినిమా షూటింగ్ మొదలైన సమయంలో డేట్లు కేటాయించే పరిస్థితి ఉంటేనే

 ఈ సినిమాలో నటిస్తానని... ఒకవేళ ఆ సమయంలో నాకు డేట్లు లేకపోతే నటించను అని జాన్వికపూర్ చెప్పినట్లుగా తెలుస్తోంది. అయితే ఒకవేళ ఈ సినిమాలో జాన్వి కపూర్ నటించకపోతే మాత్రం ఎన్టీఆర్ కి జోడిగా రష్మిక మందన నటించిన అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ ఇద్దరిలో ఎన్టీఆర్ సినిమాలో హీరోయిన్గా ఎవరు ఫైనల్ అవుతారో చూడాలి. ఇక ఎన్టీఆర్ అభిమానులు మాత్రం ఎప్పటినుండో ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్ గురించి ఎదురుచూస్తున్నారు. ఇక అతి త్వరలోనే ఎన్టీఆర్ సినిమాకి సంబంధించిన ఒక కొత్త అప్డేట్ రానుంది అనే సమాచారం అందుతుంది.

అయితే కొరటాల శివ సైతం ఎన్టీఆర్ తో వచ్చిన ఈ ఛాన్స్ ని పోగొట్టుకోకూడదని ఆయన ఏంటో ప్రూఫ్ చేయాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారట.ఇక సోలో హీరోగా ఎన్టీఆర్ అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇక ఈ సినిమాకి గాను ఎన్టీఆర్ 70 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది. కళ్యాణ్ రామ్, సుధాకర్ కలిసి ఈ సినిమాను నిర్మించడం జరుగుతుంది. ఇక ఈ సినిమా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో జై లవకుశ తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా..!!

మరింత సమాచారం తెలుసుకోండి: