తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి టాలెంట్ ఉన్న దర్శకులలో ఒకరు అయినటువంటి త్రినాధ్ రావు నక్కిన గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ దర్శకుడు సినిమా చూపిస్తా మామ , నేను లోకల్ , హలో గురు ప్రేమ కోసమే వంటి సినిమా లకు దర్శకత్వం వహించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో దర్శకుడుగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. 
ఇది ఇలా ఉంటే తాజాగా త్రినాధ్ రావు నక్కిన ,  రవితేజ హీరో గా శ్రీ లీల హీరోయిన్ గా ధమాకా అనే రొమాంటిక్ కామెడీ మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ ని తెరకెక్కించాడు. ఈ మూవీ ని డిసెంబర్ 23 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఓ ఇంటర్వ్యూ లో దర్శకుడు త్రినాథ్ రావు నక్కిన పాల్గొన్నారు. 

తాజా ఇంటర్వ్యూ లో భాగంగా దర్శకుడు త్రినాథ్ రావు నక్కిన "ధమాకా" మూవీ గురించి మాట్లాడుతూ ... ధమాకా మూవీ పక్కా కమర్షియల్ సినిమా. రౌడీ అల్లుడు లాంటి మూవీ చేద్దామని చేసిన సినిమానే ధమాకా. ఈ మూవీ లో రవితేజ డబల్ రోల్ చేస్తున్నాడు. హీరోయిన్ మాత్రం ఒకరే. రవితేజ మరియు శ్రీ లీల ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ చాలా అద్భుతంగా ఉంది. ఇద్దరు కూడా పోటీ పడి డాన్స్ చేశారు. అలాగే మరో పాట విడుదల చేయడానికి ఉంది. త్వరలోనే ఆ సాంగ్ ను విడుదల చేస్తాం. ఆ సాంగ్ మరో స్థాయిలో ఉంటుంది. పాత సినిమాల్లో రావు గోపాల్ రావు , అల్లు రామలింగయ్య గారి ట్రాక్ ఎంత ఎంజాయ్ చేస్తామో ,  ధమాకా మూవీ లో రావు రమేష్ మరియు హైపర్ ఆది గారి ట్రాక్ అంత అద్భుతంగా ఉంటుంది అని త్రినాధ్ రావు నక్కిన తాజా ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: