తాజాగా గూగుల్ సంస్థ ఈ సంవత్సరం అత్యధిక మంది వెతికిన ఏసియన్ వ్యక్తుల్లో టాప్ 5 లో నిలిచిన సభ్యుల పేర్లను ప్రకటించింది. ఇందులో నుండి ముగ్గురు భారతీయులై ఉండడం విశేషం .
 
గూగుల్ సంస్థ తాజాగా ఈ సంవత్సరం అత్యధిక మంది వెతికిన ఏషియన్ వ్యక్తుల్లో టీం ఇండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ 3 వ స్థానంలో నిలిచాడు . విరాట్ కోహ్లీ ఇప్పటికే ఎన్నో అద్భుతమైన మ్యాచ్ లతో ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన గుర్తింపు ను సంపాదించు కున్నాడు . అలాగే ఎన్నో సంవత్సరాల పాటు టీం ఇండియాకు కెప్టెన్ గా వ్యవహరించి కూడా ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు ను సంపాదించు కున్నాడు . టీం ఇండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ తర్వాత 4 వ  స్థానంలో అందాల ముద్దు గుమ్మ కత్రినా కైఫ్ నిలిచింది. కత్రినా కైఫ్ ఇప్పటికే ఎన్నో బ్లాక్ బాస్టర్ మూవీ లలో హీరోయిన్ గా నటించి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ను దక్కించుకుంది.


ఇప్పటికి కూడా కత్రినా కైఫ్ వరుస మూవీ లలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది. కత్రినా కైఫ్ తర్వాత స్థానంలో బాలీవుడ్ అందాల ముద్దు గుమ్మ అలియా భట్ 5 వ స్థానంలో నిలిచింది. ఆలియా భట్ కూడా ఇప్పటికే ఎన్నో బ్లాక్ బాస్టర్ మూవీ లలో హీరోయిన్ గా నటించి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపును తెచ్చుకుంది. ప్రస్తుతం కూడా అలియా భట్ మోస్ట్ క్రేజీ సినిమా లలో నటిస్తూ వస్తుంది. ఇక సౌత్ కొరియా బ్యాండ్ బి టి ఎస్ సభ్యులు తేయుంగ్ , జంగ్ కుక్ తొలి రెండు స్థానాలను దక్కించుకున్నారు. ఇలా గూగుల్ సంస్థ తాజాగా ప్రకటించిన లిస్ట్ లో టాప్ 5 లో ముగ్గురు భారతీయులే ఉండడం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి: