తమిళ సినిమా ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న హీరో లలో ఒకరు అయినటువంటి అజిత్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అజిత్ ఇప్పటికే ఎన్నో బ్లాక్ బాస్టర్ తమిళ మూవీ లలో హీరో గా నటించి తమిళ సినిమా ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్నాడు. అజిత్ తన కెరీర్ లో నటించిన ఎన్నో మూవీ లను తెలుగు లో కూడా విడుదల చేసి అందులో కొన్ని మూవీ లతో మంచి విజయాలను టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకొని టాలీవుడ్ ఇండస్ట్రీ లో కూడా తనకంటూ ఒక మార్కెట్ ను సృష్టించుకున్నాడు. ఇది ఇలా ఉంటే ఆఖరిగా అజిత్ "వలిమై" అనే భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు.  తమిళ్ ,  తెలుగు , కన్నడ ,  మలయాళ , హిందీ భాషలలో విడుదల అయిన ఈ మూవీ తమిళ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్ లను రాబట్టి నప్పటికీ ఇతర ఏరియా లలో మంచి కలెక్షన్ లను రాబట్ట లేక పోయింది.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అజిత్ "తునివు" అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 11 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. హెచ్ వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ని బోనీ కపూర్ నిర్మించాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడం తో తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా రన్ టైమ్ ను లాక్ చేసినట్లు తెలుస్తుంది. ఈ మూవీ 165 నిమిషాల (2 గంటల 45 నిమిషాలు) సుదీర్ఘ రన్ టైమ్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ పై  తమిళ సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ మూవీ ఏ రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: