కేరళ బ్యూటీ అయిన అనుపమ పరమేశ్వరన్. తన అందంతో, నటనతో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. ఇక తెలుగు ప్రేక్షకుల అందరిని మాత్రం తన వైపుకు మలుపుకుంది.

కేరళ బ్యూటీ కేవలం తెలుగులోనే కాకుండా తమిళ మరియు మలయాళ సినిమాలలో కూడా నటించింది. సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా కనిపిస్తుంది.తొలిసారిగా మలయాళ సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది అనుపమ. ఆ తర్వాత 'అఆ' సినిమాతో నాగవల్లి పాత్రలో చాలా బాగా ఆకట్టుకుంది. దీంతో ఆ తర్వాత వరుసగా అవకాశాలు రావడంతో.. అలా ప్రేమమ్, శతమానం భవతి, హలో గురు ప్రేమకోసమే, కృష్ణార్జున యుద్ధం, ఉన్నది ఒకటే జిందగీ, తేజ్ ఐ లవ్ యు వంటి పలు సినిమాలలో కూడా నటించి తనకంటూ ఓ మంచి గుర్తింపు ను తెచ్చుకుంది. అతి తక్కువ సమయంలో ఒక హోదా ను సొంతం చేసుకుంది అనుపమ.

ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండటంతో.. నిత్యం ఏదో ఒక ఫోటోను అలాగే ఫన్నీ వీడియోలను బాగా షేర్ చేస్తుంది. ఇక్కడ కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది ఈ బ్యూటీ. అప్పుడప్పుడు ఇంట్రెస్టింగ్ పోస్ట్ తో అందర్నీ ఆశ్చర్య పరుస్తుంది. ఖాళీ సమయం దొరికినప్పుడల్లా తన ఫాలోవర్స్ తో ముచ్చట్లు కూడా పెడుతుంది. అడిగే ప్రశ్నలకు కూడా ఓపికగా సమాధానం ఇస్తుంది.నిజానికి అనుపమ అంటే పడి చచ్చే కుర్రాళ్ళు మాత్రం చాలా మంది అయితే ఉన్నారు. ఎంతలా అంటే తను ఏదైనా ఫోటో షేర్ చేసుకుంటే చాలు వెంటనే ఆ ఫోటోలను ప్రొఫైల్ గా కూడా మార్చుకుంటారు. ఇక ఈ బ్యూటీని ముద్దుగా ఉప్మా అని పిలుచుకుంటారు తన అభిమానులు. మామూలుగా అనుపమ చూడటానికి చాలా క్యూట్ గా ఉంటుంది.

అలాంటిది ఈ బ్యూటీ చీర కట్టులో, లంగా వోని కట్టులో కనిపిస్తే మాత్రం చూడకుండా అస్సలు ఉండలేరు. నిజానికి ఈ బ్యూటీ కట్టుకున్న చీరలకే అందం వస్తుంది అని చెప్పవచ్చు. అందుకే కుర్రాళ్ళు కూడా తనకు పడిపోతారు. ఇదంతా పక్కన పెడితే తాజాగా మరోసారి తన అందాలతో కుర్రోళ్ళని పిచ్చోళ్లని చేసింది అనుపమ. ఈసారి కూడా చీర లుక్ లో కనిపించింది. పైగా ముక్కుపుడక కూడా పెట్టుకోవడంతో చాలా అందంగా కనిపించింది. ఆ ఫోటోలను తన ఇన్ స్టా లో పంచుకుంది అనుపమ. ఇక నీలిరంగు చీరలో.. తన నూడుల్స్ కురులతో కనిపించిన ఈ ముద్దుగుమ్మ మరోసారి కుర్రాల హృదయాలకు గాయం చేసింది

మరింత సమాచారం తెలుసుకోండి: