పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఎన్నో విజయవంతమైన మూవీ లలో హీరో గా నటించి అద్భుతమైన క్రేజ్ ను దేశ వ్యాప్తంగా సంపాదించుకొని ఎంతో మంది అభిమానుల మనసును కూడా దోచుకున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ సంవత్సరం పవన్ కళ్యాణ్ "భీమ్లా నాయక్" మూవీ తో మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ "హరిహర వీరమల్లు" అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. క్రిష్ జాగర్లమూడి ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తూ ఉండగా ,  నిధి అగర్వాల్ ఈ మూవీ లో పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ఏం ఏం కీరవాణిమూవీ కి సంగీతం అందిస్తున్నాడు.

మూవీ ని తెలుగు తో పాటు తమిళ , కన్నడ , మలయాళం , హిందీ భాషలలో విడుదల చేయనున్నారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ సెట్స్ పై ఉండగానే పవన్ కళ్యాణ్ తమిళంలో సూపర్ హిట్ విజయం అందుకున్నటు వంటి వినోదయ సీతం అనే మూవీ ని తెలుగు లో రీమిక్ చేయడానికి ప్లాన్స్ చేస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించనుండగా , సాయి ధరమ్ తేజ్మూవీ లో ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ మూవీ కి సముద్ర ఖని దర్శకత్వం వహించబోతున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ షూటింగ్ ను ఎలాంటి హడా విడి లేకుండా జనవరి నుండి ప్రారంభించనున్నట్లు , అలాగే ఈ సినిమా షూటింగ్ మొత్తాన్ని కూడా ఏ మాత్రం హడా విడి లేకుండా పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది. సినిమా షూటింగ్ పూర్తి అయిన తర్వాత మాత్రమే ఈ సినిమాకు సంబంధించిన హడావిడిని ప్రారంభించ బోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: