తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ప్రస్తుతం అద్భుతమైన విజయాలతో కెరియర్ ను ఫుల్ జోష్ లో ముందుకు సాగిస్తున్న నిఖిల్ తాజాగా 18 పేజెస్ అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే . అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా తెరకెక్కిన ఈ మూవీ కి పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహించాడు . ఈ మూవీ ని ఈ సంవత్సరం డిసెంబర్ 23 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ సినిమా నుండి చిత్ర బృందం కొన్ని పాటలను మరియు కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేసింది. వీటికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లోని ఒక పాటను తమిళ సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన నటులలో ఒకరు అయినటు వంటి శింబు పాడాడు.

ఇప్పటికే ఈ మూవీ లో శింబు పాడిన పాటను చిత్ర బృందం విడుదల చేయగా ,  ఆ పాటకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తుంది. ఇది ఇలా ఉంటే తాజాగా 18 పేజెస్ మూవీ యూనిట్ ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేసింది. ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను ఆధ్యాంతం ఆకట్టుకునే విధంగా ఉండడంతో ఈ మూవీ ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభిస్తుంది. ఇది ఇలా ఉంటే 18 పేజీస్ మూవీ ట్రైలర్ విడుదల అయిన 24 గంటల సమయంలో 6.37 మిలియన్ వ్యూస్ ను , 136.6 కే లైక్ లను సాధించింది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ మూవీ ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభించింది అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: