పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుస  సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఆ అన్ని సినిమాలలో మొదట సలార్ సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రభాస్. ఇక ఈ సినిమాను పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తెరకెక్కించనున్నారు. అయితే ఈ సినిమా తర్వాత ప్రభాస్ బాలీవుడ్ దర్శకుడు అయిన దర్శకత్వంలో ఆది పురుష్ సినిమా చేయనున్నారు. ఇక ఈ సినిమాలో పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ని రాముడిగా చూపించనున్నారు. అయితే ఇప్పటికే ఈ సినిమా కి సంబంధించి విడుదలైన టీజర్ ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 

అయితే వీడితోపాటు నాగ్ అశ్విన్ భారీ బడ్జెట్ తో  ప్రాజెక్ట్ కె సినిమాను కూడా పట్టాలెక్కించేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఇక మారుతీ దర్శకత్వంలో కూడా ప్రభాస్ ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో ప్రభాస్ పోలీస్ పాత్రలో కనిపించనున్నాడని సోషల్ మీడియా వేదికగా వార్తలు వస్తున్నాయి. ఇక అలాగే ఈ సినిమా హారర్ నేపథ్యంలో ఉంటుందని కూడా అంటున్నారు. అంతేకాకుండా ఈ సినిమాలో ప్రభాస్ కి జోడిగా ఏకంగా ముగ్గురు భామలు నటించనున్నారని తెలుస్తోంది. ఇక ఇందులో మాస్టర్ బ్యూటీ మాళవిక మోహన్ నిధి అగర్వాల్ మరియు రాదే శ్యామ్ బ్యూటీ రిద్ది కుమార్ కూడా ఉన్నారని తెలుస్తోంది.

 ఇక వీరిలో ఇప్పుడు ప్రభాస్ సినిమా నుండి నిధి అగర్వాల్ తప్పుకుంది అనే వార్తలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. అయితే ఇటీవల ఆమె లుక్ టెస్ట్ చేయగా ఆమె ప్రభాస్ సినిమాలో పాత్రకు సెట్ కాలేదని దాంతో ఈమెని సినిమా నుండి తప్పించాలని తెలుస్తుంది. ఇక ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియాల్సి ఉంది. ఇక నిధి అగర్వాల్ నటించిన ఇష్మార్ట్ శంకర్ తో  మంచి హిట్ అందుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమాలో ఆమె తన అందంతో ఎంతగా ఆకట్టుకుందో తెలిసిందే. కాగా ప్రస్తుతం ఈమె పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. దీంతో ఈమెకి సంబంధించిన ఈ వార్త కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: