ప్రముఖ యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటించి.. రచయితగా వర్క్ చేసిన సినిమా డీజే టిల్లు.. విమల్ కృష్ణా దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్ ప్రొడ్యూసర్ సూర్యదేవరనాగ వంశీ నిర్మించిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. కేవలం రూ.4 కోట్ల లోపు బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టి చిన్న సినిమాలలో బ్లాక్ బస్టర్ హిట్ అనిపించుకుంది. అంతేకాదు కాసుల వర్షం కూడా కురిపించింది ఈ సినిమా. అందుకే ఈ సినిమా సీక్వెల్ కూడా మొదలుపెట్టారు. దర్శకుడు విమల్ కృష్ణ తప్పుకోవడంతో ఆ ప్లేస్ లో మల్లిక్ రామ్ ను ట్రాక్ లోకి తీసుకొచ్చారు.

అయితే మొదట హీరోయిన్ గా నేహా శెట్టి ప్లేస్ లో అనుపమ పరమేశ్వరన్ ను తీసుకొచ్చారు.  షూటింగ్ కూడా మొదలుపెట్టారు. కానీ ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ ఈ ప్రాజెక్టు నుంచి అనుపమ పరమేశ్వరన్ తప్పుకుంది. ఆ తర్వాత మేకర్స్ మరో హీరోయిన్ కోసం వెతకగా ఆ ప్లేస్ లో ప్రేమమ్ ఫేమ్ మడోన్నా సెబాస్టియన్ వచ్చేసిందని ప్రచారం జరిగింది.  అయితే ఆమె లుక్ టెస్ట్ తర్వాత తను ఈ క్యారెక్టర్ కు సెట్ కాదని మేకర్స్ తేల్చేశారు.  దాంతో తను కూడా సెట్ కాలేదు. తర్వాత మీనాక్షి దీక్షిత్ కోసం టీం ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరిగింది.  కానీ అది కూడా వర్కౌట్ కాలేదు.  కానీ సిద్దు జొన్నలగడ్డ,  మేకర్స్ ఈ పాత్రలో అనుపమ పరమేశ్వరన్ మాత్రమే కరెక్ట్ అని ఫీల్ అయ్యారట.

ప్రస్తుతం ఆమె ఏ సమస్య కారణంగా బయటకు వెళ్ళిందో కానీ దానిని పక్కన పెట్టి ఇప్పుడు ఆమెనే మళ్లీ ఫైనల్ చేయాలని ఆమెను ఈ ప్రాజెక్టులోకి తీసుకురావాలని చిత్ర బృందం చర్చలు మొదలుపెట్టినట్టుగా సమాచారం.  మరి అనుపమ అంగీకరిస్తుందా ? లేదా? అనేది తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: