యంగ్ హీరో కిరణ్ అబ్బవరం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వచ్చిన మొదటి రెండు చిత్రాలతోనే తన మార్క్ క్రియేట్ చేసిన ఈయన బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాలేదు. కానీ తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకున్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఈయన నటిస్తున్న మరో చిత్రం వినరో భాగ్యము విష్ణు కథ.. గీతఆర్ట్స్2 పతాకం పై వస్తున్న ఈ సినిమా విడుదల తేదీని తాజాగా ఖరారు చేసింది చిత్రబృందం. భలే భలే మగాడివోయ్, గీతగోవిందం, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, ప్రతిరోజు పండగే వంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను నిర్మించిన గీత ఆర్ట్స్ 2 పిక్చర్స్ లో రాబోతున్న మరో చిత్రం వినరో భాగ్యము విష్ణు కథ.


రాజావారు రాణిగారు , ఎస్ఆర్ కళ్యాణమండపం , నేను మీకు బాగా కావాల్సిన వాడిని వంటి చిత్రాలతో ప్రేక్షక ఆదరణ పొందిన కిరణ్ అబ్బవరం.. హిట్ ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులకు టచ్ లో ఉంటున్నాడు.. ఈ క్రమంలోనే ఆయన వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఉండడం గమనార్హం. తాజాగా కిరణ్ అబ్బవరం హీరోగా.. కాశ్మీరా పరదేశి హీరోయిన్గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫిబ్రవరి 17వ తేదీన వచ్చే యేడాది విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా చిత్ర బృందం ప్రకటించింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్ అన్నీ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.

ఈ సినిమాను గీత ఆర్ట్స్ 2 పిక్చర్స్ పతాకం పై బన్నీ వాసు నిర్మిస్తుండగా మెగానిర్మాత అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. మురళీ కిషోర్ అబ్బురు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.  ఈ చిత్రానికి చేతన్ భరద్వాజ్ సంగీతాన్ని సమకూర్చారు.  విలేజ్ డ్రామా నేపథ్యంలో కొనసాగుతున్న ఈ సినిమా సంక్రాంతి పండుగకు పెద్ద సినిమాల హడావిడి ఉండడంతో ఫిబ్రవరి నెలలో రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం. మరి ఈ సినిమా అయినా కిరణ్ కి  భారీ విజయాన్ని అందిస్తుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: