శతాధిక చిత్రాల దర్శకుడు రాఘవేంద్రరావు గారి దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందిన పెళ్లి సందD సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన శ్రీ లీల గురించి మనందరికీ తెలిసిందే. ఈ సినిమాలో తన అందం అభినయంతో ఆకట్టుకుని ఆ తర్వాత ఇండస్ట్రీలో వరుస అవకాశాలు అందుకుంది ఇక తాజాగా శ్రీ లీల  రవితేజ హీరోగా నటిస్తున్న ధమాకా  లో నటించింది.ఈ సినిమా డిసెంబర్ 23 న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా శ్రీ లీలా మాట్లాడుతూ ఇంకొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది.

అయితే ఇందులో భాగంగానే ఆమె మాట్లాడుతూ దర్శకుడు త్రినాధరావు తెరకెక్కించిన హలో గురు ప్రేమకోసమే సినిమాలో ముందుగా నన్ను అడగడం జరిగింది. నా మొదటి సినిమా పెళ్లి సందడి కంటే ముందే ధమాకా కద నాకు చెప్పడం జరిగింది. అయితే నేను ఆ కథ విన్న పది నిమిషాలకే సినిమా చేస్తాను అని ఒప్పుకున్నాను.  నాకు చిన్నప్పటి నుండి ఎంటర్టైన్మెంట్ సినిమాలు అంటే అమితమైన ఇష్టం. ఇక ఈ సినిమాలో నేను ప్రణవి పాత్రలో అలరించనున్నాను. డ్యూయల్ రోల్లో ట్రావెల్ అయ్యే పాత్ర కన్ఫ్యూజింగ్ గా చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటుంది.

ఈ సినిమాలో ముగింపులో ఎవరు ఊహించని ట్విస్ట్ కూడా ఉంటుంది అంటూ చెప్పుకొచ్చింది ఈమె. అయితే మొదట్లో రవితేజ తో నటించడం అంటే నేను కాస్త టెన్షన్ పడ్డాను కానీ ఆయనతో షూటింగ్లో పాల్గొంటునప్పుడు  మాత్రం ఆ టెన్షన్ అంతా పోయింది. రవితేజ గారు నన్ను ఎంతో ప్రోత్సహించేవారు ఇది పక్కన పెడితే నేను ఆయనకి పెద్ద అభిమానిని ఆయన నటించిన విక్రమార్కుడు సినిమా ఎన్ని సార్లు చూసాను నాకే తెలియదు.ఇక విక్రమార్కుడు సినిమాలో ఆయన ఎంత బాగా నటించారో అంతకుమించి ఇప్పుడు ఈ సినిమాలో మీరు చూడొచ్చు. ఇక రవితేజ గారి అభిమానులు ఈ సినిమా కోసం ఎంతలా ఎదురుచూస్తున్నారో నేను కూడా అంతలా ఎదురుచూస్తున్నాను. తప్పకుండా ఈ సినిమాని చూడండి అంటూ చెప్పుకొచ్చింది శ్రీ లీల..!!

మరింత సమాచారం తెలుసుకోండి: