శ్రీలీల..ఈ పేరు ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తోంది.. రాఘవేంద్రరావు సినిమా ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చేసింది.. మొదటి సినిమాతోనే మంచి మార్కులు వేయించుకుంది..తర్వాత వరుస సినిమా అవకాశాలను అందుకుంది.. ఇప్పుడు ఏకంగా స్టార్ హీరోల సరసన నటించే అవకాశాన్ని అందుకుంది..ప్రస్తుతం ఈ అమ్మడు మాస్ హీరో రవితేజ సరసన ధమకా సినిమాలో నటించనుంది.. ఈ సినిమా అన్నీ కార్యక్రమాలను పూర్తీ చేసుకొని డిసెంబర్ 23 న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది.. ఇప్పటి వరకూ అందుథున్న సమాచారం ప్రకారం..ఈ సినిమా పై భారీ అంచనాలు నెల కొన్నాయి..దీంతో అమ్మడు ఈ సినిమా పై ఆశలు పెట్టుకుంది.


రవితేజ పక్కన ఈమె నటిస్తుండటంతో ఈమె రోల్ ఎలా ఎలా వుంటుందో అని సినీ ఇండస్ట్రీలొ టాక్ బలంగా వినిపిస్తోంది. ఇప్పటికే బయటకు వచ్చిన ఈ చిత్ర టీజర్, ట్రైలర్స్‌లో ఆమె పాత్రను చిత్ర యూనిట్ రివిల్ చేశారు.. ఇక పాటలలొ అయితే  శ్రీలీల రెచ్చిపోయి డ్యాన్స్ స్టెప్పులు వేయడంతో ఇప్పుడు ఆమె యూత్ కు హాట్ కలల హీరోయిన్‌గా మారింది. ఇకపోతే తాజాగా ధమాకా సినిమా రిలీజ్ సందర్భంగా ఓ థియేటర్ వద్ద హీరో రవితేజతో పాటు శ్రీలీల భారీ కటౌట్‌ను కూడా ఏర్పాటు చేశారు. కాగా, ప్రస్తుతం ఈ కటౌట్‌కు సంబంధించిన ఫోటో నెట్టింట వైరల్‌గా మారింది.


అసలు విషయానికొస్తే.. బెంగుళూరులోని భూమిక థియేటర్ వద్ద రవితేజతో పాటు శ్రీలీల కటౌట్ కూడా అందరినీ తెగ ఆకట్టుకుంటోంది.  ఈ బ్యూటీకి అప్పుడే ఎలాంటి క్రేజ్ క్రియేట్ అయ్యిందో అర్థం చేసుకోవచ్చు.ఇక ముందు ముందు ఈ అమ్మడు స్టార్ హీరోయిన్‌గా మారే అవకాశాలు వచ్చి పడుతున్నాయని సినీ వర్గాలతో పాటు ప్రేక్షకులు కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు.అయితే ఈ ధమాకా సినిమాతో ఈ బ్యూటీ ఎలాంటి టాక్ ను తన ఖాతాలో వేసుకుంటుంధొ చూడాలి మరి..

మరింత సమాచారం తెలుసుకోండి: