‘ధమాకా’ రిజల్ట్ శ్రీలీల కెరియర్ కు ఎంతవరకు సహకరిస్తుంది అన్నసందేహాలు అప్పుడే మొదలైపోయాయి. ‘ధమాకా’ ఎబౌ ఏవరేజ్ టాక్ తెచ్చుకోవడంతో ఈమూవీ శ్రీలీల కలలు కన్న సూపర్ హిట్ రేంజ్ కి వెళ్ళేఅవకాశాలు లేవు అన్నకామెంట్స్ వస్తున్నాయి. ఆమె మొదటి సినిమా ‘పెళ్ళిసందడి’ ఫెయిల్ అయినప్పటికీ ఆమెకు వరసపెట్టి అవకాశాలు రావడంతో ఆమె లక్కీ గర్ల్ అని అనుకున్నారు అంతా.


అయితే లేటెస్ట్ మూవీ ‘ధమాకా’ ను చూసిన సగటు ప్రేక్షకుడు ఇలాంటి సినిమాలు గతంలో చాల వచ్చాయి కదా అంటూ కామెంట్స్ చేస్తూ ఇది రవితేజా ఇమేజ్ ని పెంచే సినిమా కాదని అంటూ గ్లామర్ షోలో శ్రీలీల కు మంచి మార్కులు వేస్తున్నారు. దీనితో ఆమెకు క్రేజీ బ్యూటీగా పేరు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ ఆమె కెరియర్ కు సంబంధించి కోరుకున్న హిట్ ను ‘ధమాకా’ ఇవ్వలేదు అన్నతీర్పు సగటు ప్రేక్షకుడు ఇస్తున్నాడు.


ఈమూవీని ప్రమోట్ చేసే విషయంలో శ్రీలీల చాల యాక్టివ్ గా మీడియా ముందుకు వచ్చి అనేక సమాధానాలు ఇచ్చింది. ఈసందర్భంలో ఆమె తన భవిష్యత్ సినిమాల లిస్టును బయటపెట్టి ప్రస్తుతం ఆమె ఎంత బిజీగా ఉందో తెలియచేసింది. ప్రస్తుతం తాను రామ్ నితిన్ వైష్ణవ్ తేజ్ సినిమాలలో హీరోయిన్ గా నటిస్తూ అనీల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న మూవీలో బాలకృష్ణ కూతురుగా నటిస్తున్న విషయాన్ని తెలియచేసింది. అయితే ఈలిస్టులో ఎక్కడా ఆమె తాను మహేష్ పక్కన త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తున్న విషయాన్ని ఎక్కడా బయటపెట్టలేదు.


దీనితో త్రివిక్రమ్ మహేష్ మూవీలో ఈమె ఎంపిక కాలేదా లేకుంటే ఈమె ఆప్రాజక్ట్ ను వదులుకుందా అన్నసందేహాలు చాలామందికి వస్తున్నాయి. గత కొన్నిరోజులుగా త్రివిక్రమ్ మహేష్ మూవీలో ఈమె సెకండ్ హీరోయిన్ గా నటిస్తోంది అంటూ వార్తలు వచ్చాయి. అయితే ఆవిషయం పై ఇప్పటివరకు ఎటువంటి అధికారిక సమాచారం లేదు. సాధారణంగా యంగ్ హీరోయిన్స్ మహేష్ పక్కన నటించే అవకాశం వస్తే వదులుకోరు దీనితో శ్రీలీల మహేష్ పక్కన నటించడం ఖాయం అనుకున్నారు అంతా. అయితే శ్రీలీల ఈవిషయం పై ఇప్పటికీ ఎందుకు మౌనంగా ఉంది అంటూ కొందరు ఆశ్చర్య పోతున్నారు..



మరింత సమాచారం తెలుసుకోండి: