ఫ్రై డే రిలీజైన ధమాకా, 18 పేజెస్ సినిమాల్లో రెండు యావరేజ్ టాక్ తెచ్చుకున్నాయి. సుకుమార్ రైటింగ్స్ తో తనే కథ అందించగా సూర్య ప్రతాప్ డైరెక్ట్ చేసిన 18 పేజెస్ మూవీ కొద్దిమేరకు పర్వాలేదు అంటున్నారు. ధమాకా మాత్రం మాస్ రాజా ఫ్యాన్స్ కోసం మాత్రమే అన్నట్టు రొటీన్ కథతో చుట్టేసినట్టు చెబుతున్నారు. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే రెండు సినిమాలకు టాక్ ఎలా ఉన్నా ఈ రెండిటిలో నటించిన హీరోయిన్స్ కి మంచి పేరు వచ్చింది.

ధమాకా సినిమాలో హీరోయిన్ గా కన్నడ భామ శ్రీలీల నటించింది. ఈ సినిమాలో ఆమె ఫుల్ లెంగ్త్ పర్ఫార్మెన్స్ మెప్పించింది. అంతకుముందు పెళ్లిసందడిలో కొద్దిగా బొద్దుగా కనిపించిన ఈ అమ్మడు ధమాకాలో పర్ఫెక్ట్ గా అనిపించింది. సినిమాలో ఆమె చేసిన పాత్రలో చాలా బాగా నటించింది. స్క్రీన్ మీద శ్రీలీల తెలుగు ఆడియన్స్ కి బాగా దగ్గరైంది. కొత్త హీరోయిన్ ఇంత చలాకీ తనంతో చేస్తుంది. అందులోనూ డ్యాన్స్ లో కూడా అదరగొట్టేస్తుంది అంటే తప్పకుండా అమ్మడికి ఇక్కడ మంచి లైఫ్ ఉన్నట్టే అని అంటున్నారు.

ఇక 18 పేజెస్ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ కూడా మంచి అభినయం కనబరచింది. సినిమాలో నిఖిల్ కూడా పర్ఫార్మ్ చేసినా ఎక్కువ మార్కులు మాత్రం ఫీమేల్ లీడ్ అనుపమకే పడ్డాయని చెప్పొచ్చు. అనుపమకి కరెక్ట్ టైం లో కరెక్ట్ రోల్ 18 పేజెస్ సినిమాలో పడ్డది. సుకుమార్ కథ కాబట్టి హీరోయిన్ పాత్రలు చాలా కనెక్టెడ్ గా ఉంటాయి. అందుకే ఈ సినిమాలో కూడా అనుపమ అందరిని అలరిస్తుంది. ఇలా రెండు సినిమాల్లో కథనాయికలకు వచ్చిన పేరు హీరోలకు రాలేదు. అఫ్కోర్స్ హీరో కోసం వచ్చిన హీరోయిన్ కోసం వచ్చినా సినిమాకు కావాల్సింది వసూళ్లే కాబట్టి ఎలా వచ్చినా ఓకే అంటున్నారు ఆడియన్స్.


మరింత సమాచారం తెలుసుకోండి: