
ఇకపోతే థియేటర్లలో విడుదలయ్యి మంచి విజయాన్ని అందుకున్న నేపథ్యంలో 18 పేజెస్ చిత్ర బృందం నేరుగా థియేటర్లకు వెళ్లి ప్రేక్షకులను సర్ప్రైజ్ చేస్తున్నారు.. అందులో భాగంగానే హైదరాబాదులోని ఎర్రగడ్డలో ఉన్న గోకుల్ థియేటర్ ను సందర్శించిన చిత్ర బృందానికి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. ముఖ్యంగా ఈ వారం చాలా థియేటర్లను సందర్శించాలని టీం కూడా ప్లాన్ చేసింది. మరి ఇప్పటికే థియేటర్లలో కథ కంటెంట్ పరంగా ప్రేక్షకులను మెప్పించిన ఈ చిత్రం ప్రస్తుతం అభిమానులను నేరుగా కలవడంతో మరింత సర్ప్రైజ్ అవుతున్నారు.
ఇప్పటి వరకు చిత్ర బృందం కేవలం ఒకటి రెండు రోజులు మాత్రమే థియేటర్లకు నేరుగా వెళ్లి అభిమానులను అలరించారు. అయితే ఇప్పుడు ఏకంగా వారం రోజులపాటు ఈ చిత్ర బృందం ప్రేక్షకులతో మమేకం కాబోతున్నారని తెలిసి.. ఆ థియేటర్లకు అభిమానులు క్యూ కట్టారు. ఏది ఏమైనా అనుపమ , నిఖిల్ జోడి మరొకసారి సూపర్ హిట్ పెయిర్ గా గుర్తింపు తెచ్చుకుంది. మరి వీరిద్దరి కాంబినేషన్లో మరొక సినిమా రావాలని అభిమానులు సైతం కోరుకుంటున్నారు.