గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో  పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ మరియు క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో త్వరలోనే ఒక సినిమా రానుంది అన్న వార్తలు వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్ గా నిలిచిన వీరిద్దరి కాంబినేషన్లో రానున్న సినిమాకి సంబంధించిన వార్తను అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ కారణమని చాలామంది పోస్టులను కూడా షేర్ చేశారు. అయితే ఇలాంటి ఒక డిఫరెంట్ కాంబినేషన్ లో సినిమా కోసం వీరి అభిమానులు ఎదురుచూస్తున్నారు. కానీ ఇదంతా అబద్ధం... వీరి కాంబినేషన్లో ఏలాంటి సినిమా రావడం లేదు.

అయితే తాజాగా దీనికి సంబంధించిన ఒక పోస్ట్ ను వారి సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు అభిషేక్ అగర్వాల్. ఇక ఈ వార్త కి సంబంధించి ఆయన.... "ప్రతి ప్రాజెక్టు వివరాలని సమయం వచ్చినప్పుడు మేమే అఫీషియల్ గా మా సోషల్ మీడియా వేదికగా లేదా పలు విధాలుగా మేమే అనౌన్స్ చేస్తాము.' మేము అనౌన్స్ చేసే అప్పటివరకు ఇలాంటి రూమర్స్ ని కూడా ఎవరు నమ్మకండి అంటూ తన సోషల్ మీడియా వేదికగా చెప్పుకొచ్చాడు అభిషేక్ అగర్వాల్. దీంతో సుకుమార్ మరియు ప్రభాస్ ల కాంబినేషన్లో త్వరలోనే సినిమా రానుంది అన్న వార్తకి ఫుల్స్టాప్ పడింది. ప్రస్తుతం సుకుమార్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో కలిసి పుష్ప 2 సినిమాలో బిజీగా ఉన్నాడు.

ఇక అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ ఇప్పుడు వ్యాక్సిన్ వార్ అని సినిమా పనిలో బిజీగా ఉన్నారు. పన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం సలార్, ప్రాజెక్ట్ k, ఆది పురుష్, స్పిరిట్ సినిమాలతో కొంచెం కూడా కాళీ లేకుండా బిజీగా ఉన్నాడు. ఇక ఇలాంటి సమయంలో వీరిద్దరి కాంబినేషన్లో సినిమా చేయడం అనేది చాలా కష్టమైన పని. ఈ వార్త అనంతరం వీరిద్దరి కాంబినేషన్లో ఏలాంటి సినిమా లేదు అని వారి అభిమానులకు క్లారిటీ వచ్చింది. ఇక ఈ వార్త కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: