ఇక తన మాజీ ప్రియురాలిని సల్మాన్ ఖాన్ ముద్దుపెట్టుకున్నాడు. దీంతో ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్‌గా మారింది. తన పుట్టిన రోజు సందర్భంగా.. సల్మాన్ ఖాన్  విలాసవంతమైన పార్టీని ఇవ్వడం జరిగింది.దీనికి పలువురు బాలీవుడ్ ఫేమస్ ప్రముఖులు అందరూ కూడా హాజరయ్యారు.ఇంకా అలాగే సంగీతా బిజ్లానీ కూడా బర్త్ డే పార్టీకి వచ్చింది.సల్మాన్ ఖాన్.. తన కెరీర్ స్టార్టింగ్ లో సంగీతా బిజ్లానీతో ప్రేమలో ఉన్నాడు. సుమారు 10 సంవత్సరాలు పాటు వీరిద్దరూ కూడా డేటింగ్ చేశారు. అయితే పెళ్లి చేసుకోవాలనుకునే సమయంలో కొన్ని వ్యక్తిగత కారణాలతో వీడిపోయారు. అయితే బర్త్ డే పార్టీ సమయంలో సంగీత నుదిటిపై సల్మాన్ ఖాన్ ముద్దుపెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్‌గా మారింది. దీనిపై అభిమానులు ఎన్నో రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. వారిద్దరూ పెళ్లి చేసుకోవలసిందే అని కామెంట్స్ చేస్తున్నారు.సల్మాన్ ఖాన్ నేటితో 57 వ సంవత్సరంలోకి అడుగుపెట్టాడు. అతడి చెల్లెలు అర్పితా ఖాన్‌ నివాసంలో గ్రాండ్‌గా పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు. 


ఈ వేడుకకు షారుక్‌ ఖాన్‌ జాన్వీకపూర్‌, టాలీవుడ్ హీరోయిన్ పూజా హెగ్డే, టబు, సునీల్ శెట్టి, రితేశ్, జెనీలియా, సోనాక్షి సిన్హా, కార్తీక్‌ ఆర్యన్‌తో పాటు కొంతమంది సెలబ్రిటీలు కూడా హాజరవ్వడం జరిగింది. ఇక ఈ పార్టీకి సంబంధించిన ఫోటోలు వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతూ చక్కర్లు కొడుతున్నాయి.ఈ పార్టీకి బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ కూడా హాజరైన విషయం అందరికి తెలిసిందే. సల్మాన్ ఖాన్ ఇంకా షారుఖ్ ఖాన్ ఒక చోట కనిపించడంతో ఆయన ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. సల్మాన్‌, షారుక్‌ను ఒకే ఫ్రేమ్లో చూసిన మ్యూచువల్ ఫ్యాన్స్‌ తెగ ఆనందపడుతున్నారు. షారుఖ్ నటిస్తున్న ఓ సినిమాలో సల్మాన్ ఖాన్ అతిథి పాత్రలో కనిపించబోతున్నారు. ఈ స్టార్ హీరోకి అభిమానులు నుంచి, సినీ ప్రముఖుల దాకా ఎన్నో పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: