బుల్లితెరపై కమెడియన్ గా తన సత్తాను చాటుకున్న సుడిగాలి సుధీర్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. బుల్లితెరపై స్టార్ గా  మంచి గుర్తింపును పొందాడు సుధీర్. జబర్దస్త్ షోలో కమెడియన్ గా ఈయన కెరియర్ను మొదలుపెట్టిన సుడిగాలి సుధీర్ అనంతరం కొన్ని సినిమాలలో ఆర్టిస్ట్ గా కూడా నటించాడు. దాని అనంతరం ఇప్పుడు హీరోగా ఎదిగాడు సుధీర్. మొదటిగా సాఫ్ట్వేర్ సుధీర్ సినిమాతో హీరోగా తన కెరీర్ను మొదలుపెట్టిన ఈయన తాజాగా గాలోడు సినిమాతో సూపర్ డూపర్ హిట్టును అందుకున్నాడు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో హీరోగా కూడా తన సత్తాను చాటాడు సుడిగాలి సుదీర్. 

సుధీర్ సినిమాల్లో ఎంట్రీ ఇచ్చిన అనంతరం బుల్లితెరపై ఈయనను ఆయన అభిమానులు బాగా మిస్ అవుతున్నారు. ఈయన కామెడీని ముఖ్యంగా చాలామంది మిస్ అవుతున్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ నేపథ్యంలోనే సుడిగాలి సుధీర్ మళ్లీ యాంకర్ గా కమెడియన్ గా కొనసాగాలని అనుకుంటున్నాడు. సాధారణంగా ఎవరైనా హీరో అయితే తిరిగి వెనక చూసుకోకుండా అదే పనిగా సినిమాలు చేసుకుంటూ పోతారు. కానీ సుడిగాలి సుదీర్ మాత్రం మళ్ళీ రావాలని ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తుంది.అయితే తాజాగా హైపర్ ఆది రష్మితో మీవాడు కం బ్యాక్ కోసం తెగ బ్రతిమాలాడుతున్నాడు అంట కదా

 అంటూ రష్మితో చెప్పుకొచ్చాడు హైపర్ ఆది. దీంతో చాలామంది పరోక్షంగా.. సుదీర్ మళ్లీ మల్లెమాలకు ఎంట్రీ ఇవ్వాలని బ్రతిమలాడుతున్నట్లుగా చెప్పినట్లు భావిస్తున్నారు. కానీ అదంతా నిజం కాదు. ఇటీవల సుడిగాలి సుదీర్ హీరోగా నటించిన గాలోడు సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ తిరిగి నేను జబర్దస్త్ కి ఎంట్రీ ఇస్తాను నాకు మల్లెమాలకీ మధ్య ఇలాంటి మనస్పర్ధలు లేవు అంటూ క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఇది చెప్పి చాలా రోజులు కావస్తున్నప్పటికీ సుడిగాలి సుదీర్ కోసం ఆయన అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: