
ప్రభాస్ తో సినిమా అంటే మరో ఏడాది పైన ఆగాల్సిందే. అలా ఎందుకు అంటే ప్రభాస్ వరుస ప్రాజెక్ట్ లు చేస్తున్నాడు. నెక్స్ట్ ఇయర్ మిడిల్ వరకు మారుతి సినిమా, సలార్ సినిమా పనుల్లోనే ఉంటాడు. మధ్యలో ప్రాజెక్ట్ కె కూడా ఉంది. ఇవన్ని పూర్తి చేశాక కానీ సందీప్ తో స్పిరిట్ సినిమా చేసే ఛాన్స్ లేదు. అందుకే సందీప్ వంగ యానిమల్ తర్వాత ప్రభాస్ తో స్పిరిట్ చేసే గ్యాప్ లో మరో సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాడు. అది ఎవరితో అంతే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో అని తెలుస్తుంది.
పుష్ప సినిమాతో అల్లు అర్జున్ కూడా పాన్ ఇండియా స్టార్ గా మారాడు. పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ ఎవరితో సినిమా చేస్తాడా అన్న క్లారిటీ రాలేదు. యానిమల్ పూర్తైతే పుష్ప 2 తర్వాత సందీప్ తో అల్లు అర్జున్ సినిమా ఉండే ఛాన్స్ ఉందట. అదే జరిగితే మాత్రం అల్లు అర్జున్ తో సందీప్ కాంబో ఫిక్స్ అయినట్టే. అసలైతే సందీప్ వంగ అర్జున్ రెడ్డి సినిమా కథ అల్లు అర్జున్ తో చేయాలని అనుకున్నాడట. కానీ ఆ ఛాన్స్ కాస్త విజయ్ దేవరకొండ అందుకున్నాడు. మరి ఇప్పుడు ఆ కాంబో సెట్ అయితే మాత్రం మరో ట్రెండ్ సెట్ మూవీ వచ్చే ఛాన్స్ ఉంది.