టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఎవరి సపోర్టు లేకుండా వచ్చి తనకంటూ మార్కెట్ ను ఏర్పాటు చేసుకున్న నాచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జనాల మనిషిగా నటసింహ బాలకృష్ణ చేత కీర్తింపబడ్డ నాచురల్ స్టార్ నాని ఎన్నో సినిమాలలో నటించి తన వైవిద్య భరితమైన నటనతో ప్రేక్షకులను పూర్తిస్థాయిలో మెప్పించాడు. ముఖ్యంగా మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ఈయన తాజాగా శ్యామ్ సింగారాయ్ సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకొని అరుదైన కలెక్షన్స్ సృష్టించిన నాని.. ఆ తర్వాత అదే జోష్తో నటించిన చిత్రం అంటే సుందరానికి.


ఈ చిత్రంలో ప్రముఖ కోలీవుడ్ హీరోయిన్ నజ్రియా నేరుగా తెలుగు చిత్రంలో నటించింది. అయితే ఈ సినిమాలో ఈమె నటించి విమర్శలు ఎదుర్కొంది. రాజా రాణి సినిమాలో కనిపించినంత అందంగా ఇప్పుడు లేదు అని విమర్శలు వచ్చాయి అంతేకాదు ఇందులో బ్రాహ్మణ అబ్బాయిగా నాని కనిపించినప్పటికీ ప్రేక్షకులను మెప్పించలేకపోయాడు. దాంతో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ గా మిగిలింది. ఇకపోతే ఇప్పుడు నాని తన తదుపరి చిత్రాన్ని ఎప్పుడు ప్రకటించబోతున్నాడు అనే వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి.
ఈ క్రమంలోని నాని తన 30వ చిత్రానికి సంబంధించి దర్శకుడు అలాగే ఇతర వివరాలను రేపు సాయంత్రం 4:05 గంటల సమయంలో వెల్లడించనున్నట్లు ప్రకటించనున్నాడు. అయితే ఇప్పుడు నాని ఎవరితో తన సినిమాని చేయబోతున్నాడు?  హీరోయిన్ ఎవరు? నిర్మాతలు ఎవరు? ఇలా ఎన్నో ప్రశ్నలు అభిమానులలో మొదలవుతున్నాయి. మరి ఈ సినిమాకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాలి అంటే రేపటి సాయంత్రం అధికారిక అప్డేట్ వచ్చేవరకు ఎదురుచూడాల్సిందే. ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి,  శ్రీకాంత్ వంటి హీరోలను ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఇండస్ట్రీలోకి వచ్చి ఎవరి సపోర్టు లేకుండా అసిస్టెంట్ డైరెక్టర్గా తన కెరీర్ ను మొదలుపెట్టి నేడు స్టార్ హీరోగా చలామణి అవుతున్నారు నాని.  ఏది ఏమైనా ఆయన పట్టుదలకు ప్రతి ఒక్కరు ఫిదా అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: