తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం ఇలా అన్ని భాషల్లో దాదాపు 18 ఏళ్ల నుండి సినిమాలో నటిస్తూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది పూర్ణ. ప్రస్తుతం ఈటీవీ షోలతో మరియు సినిమాలతో బిజీగా ఉంది ఈమె. ఇటీవల అఖండ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న పూర్ణ తాజాగా తన సోషల్ మీడియా వేదిక ద్వారా ఒక శుభవార్తను తన అభిమానులతో పంచుకుంది.అయితే ఇటీవల దుబాయ్ కి చెందిన ఒక ప్రముఖ వ్యాపారవేత్త శానిద్ అసిఫ్ అలీని ఇటీవల పూర్ణ వివాహం చేసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇక ప్రస్తుతం తన వివాహ జీవితాన్ని ఎంజాయ్ చేస్తుంది ఈమె.

అయితే ఇందులో భాగంగానే తను తల్లిగా ప్రమోషన్ అందుకోబోతుంది అన్న విషయాన్ని యూట్యూబ్ వీడియో ద్వారా షేర్ చేసింది. తాజాగా తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రెగ్నెన్సీని అనౌన్స్ చేసింది పూర్ణ. ఇందులో భాగంగానే తన తల్లిదండ్రులతో కూర్చుని ఈ గుడ్ న్యూస్ను చెప్పుకొచ్చింది పూర్ణ. ఇక ఈ వీడియోలో తన ఫ్యామిలీతో కలిసి ఈ గుడ్ న్యూస్ను షేర్ చేసుకొని కేక్ కూడా కట్ చేసింది. దీంతో ఈ వార్త విన్న చాలా మంది ఆమె అభిమానులు ఈ వీడియోకి గాని కామెంట్ల రూపంలో పూర్ణకి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టిన పూర్ణ దంపతులు..

మళ్లీ ఇలాంటి శుభవార్త చెప్పడం ఆమె అభిమానులకి ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది అని చెప్పాలి. దీంతో ఈ వార్త విన్న చాలా మంది సినీ సెలబ్రిటీలు సైతం పూర్ణకు శుభాకాంక్షలు చెప్తున్నారు. ఇదిలా ఉంటే ఇక కొన్నాళ్లపాటు షానిద్ తో ప్రేమలో ఉన్న పూర్ణ  తర్వాత కుటుంబ సభ్యులను ఒప్పించి కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్న కొద్ది నెలల వ్యవధిలోనే ఈ గుడ్ న్యూస్ చెప్పడంతో ఆమె అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: