తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం మంచి జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్న యువ హీరోలలో ఒకరు అయినటువంటి సిద్దు జొన్నలగడ్డ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ హీరో కొంత కాలం క్రితం డీజే టిల్లు అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. విమల్ కృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీలో నేహా శెట్టి హీరోయిన్ గా నటించింది.

తక్కువ బడ్జెట్ తో మామూలు అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. ఈ మూవీ ద్వారా సిద్దు జొన్నలగడ్డ కు సూపర్ క్రేజ్ కూడా లభించింది. ఇలా డీజే టిల్లు మూవీ అద్భుతమైన విజయం సాధించడంతో సిద్దు జొన్నలగడ్డ ఈ మూవీ కి సీక్వల్ గా టిల్లు స్క్వేర్ అనే మూవీ ని ప్రకటించాడు. కాకపోతే ఈ మూవీ కి డిజె టిల్లు మూవీ కి దర్శకత్వం వహించిన విమల్ కృష్ణ దర్శకత్వం వహించడం లేదు. ఈ మూవీ కి మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటివరకు ఈ మూవీలో హీరోయిన్ ఎవరు అనే విషయం చిత్ర బృందం క్లారిటీగా ప్రకటించలేదు. 

దానితో పలువురు పేర్లు ఇప్పటికే తెరపైకి వచ్చాయి. కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన ఒక చిన్న వీడియోను కూడా విడుదల చేసింది. ఆ వీడియోకు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. ఇది ఇలా ఉంటే తాజాగా టిల్లు స్క్వేర్ మూవీ యూనిట్ ఈ సినిమా నుండి న్యూ ఇయర్ సందర్భంగా ఒక పోస్టర్ ను విడుదల చేసింది. ఈ పోస్టర్ లో సిద్దు జొన్నలగడ్డ సిల్వర్ కలర్ లో స్టైలిష్ లుక్ ఉన్న డ్రెస్ ను వేసుకొని ఉన్నాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: