ప్రభాస్ పేరు ఎక్కడా వినిపిస్తోంది..సినిమాల గురించి కాదు..బాలయ్య షో అన్ స్టాపబుల్ 2 ద్వారా ..ఈ షొ ద్వారా డార్లింగ్ మనసులోని మాటలు బయట పడ్డాయి..మొత్తానికి ఆ ఎపిసోడ్ అందరికి ఓ ఊపును ఇచ్చింది..తన ఫ్రెండ్ గోపిచంద్‏తో ‏కలిసి పాల్గొన్నారు. వీరికి సంబంధించిన ఫస్ట్ ఎపిసోడ్ గురువారం స్ట్రీమింగ్ అయ్యింది. అయితే రిలీజ్ కావాల్సి సమయంలో సాంకేతిక సమస్యల కారణంగా ఆగిపోయినా.. ఆ తర్వాత వెంటనే విడుదల చేశారు. తాజాగా ఈ ఎపిసోడ్ రికార్డ్ సృష్టించింది. చరిత్రను తిరగ రాసింది...ఇది నిజంగా ఆఁహాఁ సాధించిన ఘనత అనే చెప్పాలి..


కేవలం విడుదలైన క్షణాల్లోనే 100 మిలియన్స్ పైగా వ్యూయింగ్ మినిట్స్ ను నమోదు చేసింది. ఈ విషయాన్ని ప్రముఖ ఓటీటీ ప్లా్ట్ ఫాం తెలియజేస్తూ.. ప్రభాస్ అభిమానులకు.. ఆహా సబ్ స్క్రైబర్లకు ధన్యవాదాలు తెలిపింది. ఈ ఫస్ట్ ఎపిసోడ్ లో ప్రభాస్ తన వ్యక్తిగత విషయాలతోపాటు.. ప్రేమ, పెళ్లి, సినిమాల గురించి ఆసక్తికర విషయాలను బయటపెట్టారు. ఈ క్రమంలోనే డార్లింగ్ పెళ్లి గురించి మెగా పవర్ స్టార్ హింట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇకపోతే ప్రభాస్ కు సంబంధించిన సెకండ్ ఎపిసోడ్ ప్రోమోను న్యూయర్ కానుకగా జనవరి 1న ఉదయం 10 గంటలకు విడుదల చేశారు.. ఆహా టీమ్..వచ్చే శుక్రవారం ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది. ఇందులో ప్రభాస్ తోపాటు, గోపిచంద్ కూడా కనిపించారు..


ఎపిసోడ్ ప్రోమో వీడియో కూడా జనాలను విపరీతంగా ఆకట్టుకుంది..ప్రస్తుతం ఈ ఎపిసోడ్ నెట్టింట ట్రెండ్ అవుతుంది.ఇక సినిమాల విషయానికొస్తే..ప్రభాస్ వరుస పాన్ ఇండియా చిత్రాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఆయన నటిస్తోన్న సినిమాలన్ని భారీ వ్యయంతో నిర్మిస్తుండడం విశేషం..టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలలో సంచలనాలు సృష్టించిన దర్శకులు తెరకెక్కిస్తుండడంతో డార్లింగ్ చేస్తున్న సినిమాలపై అంచనాలు భారీగా ఉన్నాయి..ఎ ఒక్క సినిమా హిట్ అయిన కూడా ఆయన పేరు డబుల్ అవుతుంది..డార్లింగ్ క్రేజ్ పెరుగుతుంది..వచ్చే ఏడాదిలో విడుదల కానున్న ఈ సినిమాలలో ఏ సినిమా భారీ హిట్ ను అందుకుంటుందో చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: