తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి పాపులారిటీ కలిగిన యువ కథానాయకులలో ఒకరు అయినటువంటి అక్కినేని నాగ చైతన్య గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఎన్నో విజయవంతమైన మూవీ లలో నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈ యువ హీరో పోయిన సంవత్సరం బాలీవుడ్ మిస్టర్ ఫర్ఫెక్ట్ అమీర్ ఖాన్ హీరోగా కరీనా కపూర్ హీరోయిన్ గా తెరకెక్కిన లాల్ సింగ్ చడ్డ మూవీ ద్వారా హిందీ పరిశ్రమలోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు.

మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించకపోయినప్పటికీ నాగ చైతన్య కు ఈ మూవీ ద్వారా హిందీ పరిశ్రమలో మంచి గుర్తింపు లభించింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం నాగ చైతన్య ... విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దూత అనే వెబ్ సిరీస్ తో పాటు వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతున్న కస్టడీ అనే మూవీ లో కూడా నటిస్తున్నాడు. కస్టడీ మూవీ లో నాగ చైతన్య సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... ఇళయరాజా ... యువన్ శంకర్ రాజా ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నారు. 

అరవింద స్వామి ... ప్రియమణిమూవీ లో ఇతర కీలకపాత్రలలో కనిపించనుండగా ... ఈ మూవీ లో నాగ చైతన్య పోలీస్ కానిస్టేబుల్ పాత్రలో కనిపించబోతున్నాడు. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ఈ మూవీ యూనిట్ ప్రకటించింది. ఈ మూవీ ని ఈ సంవత్సరం మే 12 వ తేదీన విడుదల చేయనున్నట్లు కస్టడీ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. మరి ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్ విజయాన్ని సొంతం చేసుకుంటుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సింది.

మరింత సమాచారం తెలుసుకోండి: