ఇటీవల 'రంగ రంగ వైభవంగా' అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చిన మెగా మేనల్లుడు పంజా వైష్ణవ తేజ్.. ప్రస్తుతం  శ్రీకాంత్ రెడ్డి అనే దర్శకుడితో ఓ సినిమా చేస్తున్నాడు. #PVT04 అనే వర్కింగ్ టైటిల్ తో ఇటీవల ఫస్ట్ లుక్ పోస్ట్ ని విడుదల చేసిన చిత్ర యూనిట్ తాజాగా ఈ సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు. ఏప్రిల్ 29న ఈ సినిమాని విడుదల చేస్తున్నట్లు పేర్కొంటూ ఈ మేరకు తాజాగా ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ ఈ సినిమాని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇక వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తున్న నాలుగవ సినిమా ఇది. 

ఇక ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ సరసన శ్రీ లీల హీరోయిన్గా నటిస్తోంది. సినిమాలో వైష్ణవ తేజ్ మాస్ లుక్ లో కనిపించబోతున్నాడు. ఇక ఈ సినిమాతో శ్రీకాంత్ రెడ్డి డైరెక్టర్గా వెండితెరకు పరిచయం అవుతున్నాడు. ఇప్పటికే  చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరింది. ఈ సినిమాలో వైష్ణవ తేజ్ గతంలో ఎన్నడూ లేనంత సరికొత్త లుక్ లో కనిపించబోతున్నాడు. అందుకు తాజాగా విడుదలైన పోస్టర్ చూస్తేనే అర్థమవుతుంది  ఇక ఈ పోస్టర్ ని ఒకసారి గమనిస్తే.. తీగల కంచే అవతల వైపు వైష్ణవ తేజ్ నిలిచి ఉన్నట్లుగా ఉంది. మరోవైపు ఫెన్సింగ్ కి మంటలు అంటుకున్నట్లు కూడా కనిపిస్తుంది. 

మొత్తానికి ఈసారి మెగా మేనల్లుడు కంప్లీట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ తో రావాలని ఫిక్స్ అయినట్లుగా కనిపిస్తున్నాడు. అయితే సినిమా టైటిల్ ని ప్రకటించక ముందే విడుదల తేదీని ఖరారు చేసింది చిత్ర బృందం. టైటిల్ తో పాటు మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడించబోతున్నట్లు సమాచారం. ఇక సినిమాలో వైష్ణవ తేజ్ యాక్షన్ నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే హీరోయిన్ శ్రీ లీల నటన, డాన్స్ కూడా మరో లెవల్లో ఉంటాయని అంటున్నారు. తాజాగా ఈ యంగ్ హీరోయిన్ రవితేజతో 'ధమాకా' సినిమాలో నటించి సాలిడ్ హిట్ అందుకుంది. ఈ సినిమాలో శ్రీలీల స్క్రీన్ ప్రజెన్స్, డాన్స్, యాక్టింగ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు వైష్ణవ్ తేజ్ సరసన ఈమె నటిస్తుండడంతో ఈ సినిమాపై కూడా అంచనాలు భారీగానే నెలకొన్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: