టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్‌, కేరళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్‌ జంటగా నటించిన సినిమా 18 పేజెస్‌. క్రిస్మస్‌ పండుగ కానుకగా డిసెంబర్ 23 వ తేదీన థియేటర్లలో విడుదలైన ఈ సినిమా చాలా మంచి విజయం సాధించింది.రిలీజ్ అయిన ఫస్ట్ షో నుంచే ఈ సినిమా ప్రేక్షకుల నుంచి విపరీతమైన పాజిటివ్‌ రెస్పాన్స్‌ ని అందుకుంది. దీంతో ఫస్ట్ డే ఈ మూవీ బ్రేక్‌ ఈవెన్‌ కలెక్షన్స్‌తో ఈ సినిమా దూసుకెళ్లింది. కేవలం మౌత్‌ టాక్‌తోనే ఈ సినిమాకి రోజు రోజుకు ఆదరణ అనేది బాగా పెరుగుతోంది. ఈ సినిమా విడుదలై ఇప్పటికీ 10 రోజులు గడుస్తున్నా కూడా ఇప్పటికి థియేటర్లో స్పీడ్ గా దూసుకుపోతోంది.ఈ ఫీల్‌ గుడ్‌ లవ్‌స్టోరీని చూసేందుకు జనాలు ఇప్పుడు మళ్లీ మళ్లీ థియేటర్‌కు వస్తున్నారు. దాని ఫలితంగా ఈ సినిమా ఇప్పటి దాకా రూ. 20 కోట్ల గ్రాస్‌ వసూళ్లు సాధించింది. బన్నీ వాసు నిర్మించిన ఈ సినిమాను, మెగా నిర్మాత అయిన అల్లు అరవింద్ సమర్పించడం జరిగింది.


ఇదిలా ఉంటే ఈ సినిమాకి పాన్‌ ఇండియా స్టార్ డైరెక్టర్‌ సుకుమార్‌ కథ అంధించిన సంగతి తెలిసిందే.ఆయన శిష్యుడు 'కుమారి 21ఎఫ్' ఫేమ్ సూర్యప్రతాప్ పల్నాటి ఈ సినిమాని ఫీల్‌గుడ్‌ లవ్‌స్టోరీగా మలిచారు.ఇందులో హీరో హీరోయిన్ల పాత్రలను బాగా మలిచిన తీరు, పాటలు, కొన్ని అందమైన విజువల్స్ ఇంకా అలాగే వీటన్నింటిని మించి సుకుమార్ మార్క్‌తో కూడిన క్లైమాక్స్ ఆడియన్స్‌ను చాలా బాగా ఆకట్టుకుంది. ఆదివారం నాడు ఈ సినిమా హౌస్ ఫుల్ వసూళ్లతో బాగా స్పీడ్ గా దూసుకుపోయింది. చూడాలి ఈ సినిమా ఇంకా ఎంత వసూళ్లు సాధిస్తుందో..రీసెంట్ గా కార్తికేయ 2 సినిమాతో చాలా పెద్ద హిట్ అందుకున్న నిఖిల్ ఈ సినిమాతో కూడా అదే హిట్ ట్రాక్ ని కంటిన్యూ చేసి మరో సారి తానేంటో రుజువు చేసుకోని స్టార్ హీరోల జాబితాలో చోటు సంపాదించుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: