టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సాధారణంగా ఒకే హీరో డ్యూయల్ రోడ్ లేదా త్రిబుల్ రోల్ పాత్రలను నటించడం మనం చూస్తూనే ఉంటాం. కానీ ఇప్పుడు అలా చాలా తక్కువ మంది హీరోలు నటిస్తున్నారు. ఓకే హీరో రెండు మూడు పాత్రలో నటించడం అనేది ఒకప్పుడు చాలా పెద్ద విషయం. అంతే కాదు అప్పట్లో దాన్ని ఒక వింతలాగా అందరూ భావించేవారు. సీనియర్ ఎన్టీఆర్ కాలంలో ఆయన ఏకంగా మూడు మూడు పాత్రల్లో నటించేవారు. రాను రాను ఇలా ఒకే హీరో రెండు మూడు పాత్రల్లో నటించడం చాలా తగ్గిపోయింది. కానీ కమలహాసన్ మాత్రం ఎప్పుడూ ఏదో ఒక కొత్త పాత్రలో అందరినీ అలరిస్తూ ఉంటాడు.

 అలా గతంలో మైఖేల్ మదన కామరాజు సినిమాలో ఏకంగా త్రిబుల్ రోల్ లో నటించాడు కమల్ హాసన్.దాని అనంతరం దశావతారం సినిమాల్లో ఏకంగా ఒకేసారి పది పాత్రలో నటించాడు కమలహాసన్. కమలహాసన్ లాగా అలా పది పది పాత్రల్లో నటించడం మరే హీరోకి సాధ్యం కాదు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.కానీ ఇప్పుడు మాత్రం ఏ హీరో కూడా అలాంటి పాత్రలో నటించడానికి ఆసక్తి చూపడం లేదు. మెగాస్టార్ చిరంజీవి లాంటి స్టార్ హీరోలే త్రిబుల్ రోల్ పాత్రల్లో మాత్రమే నటించారు. సాధారణంగా ఇలాంటి కథలను స్టార్ హీరోలు ఎంచుకునేటప్పుడు

 ఆ కథ కరెక్ట్ గా ఉందా లేదా అన్నది చూసుకొని నటిస్తూ ఉంటారు. లేకపోతే ఆ సినిమా ఖచ్చితంగా ఫ్లాప్ అవుతుంది. ఇక అలా గతంలో చిరంజీవి నటించిన ముగ్గురు మొనగాళ్లు సినిమా మంచి విజయాన్ని అందుకుంది. తాజాగా ఇప్పుడు ఉన్న స్టార్ హీరోలలో ఎన్టీఆర్ మాత్రమే జై లవకుశ అనే సినిమాలో మూడు పాత్రలో నటించాడు. ఆయన తప్ప మరే హీరో ఇలా మూడు పాత్రల్లో నటించింది లేదు. అయితే రానురాను ఇలా ఒకే హీరో రెండు మూడు పాత్రల్లో నటించడం కష్టమయ్యే పరిస్థితిలో కనిపిస్తున్నాయి. ఇక మాస్ మహారాజా రవితేజ వంటి హీరో సైతం డ్యూయల్ రోల్ పాత్రలలో మాత్రమే నటించాడు. ఇక రాంచరణ్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న సినిమాలో డ్యూయల్ రోల్లో కనిపిస్తాడు అన్న వార్తలు గత కొన్ని రోజులుగా వినిపిస్తున్నాయి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: