తాజాగా ధమాకా సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు మాస్ మహారాజా రవితేజ. ఆయన హీరోగా నటించిన రాజా ది గ్రేట్ సినిమా తర్వాత వరుస ఫ్లోప్ లతో ఉన్న రవితేజ దాని అనంతరం క్రాక్ సినిమాతో మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. దాని తరువాత ఈయన హీరోగా నటించిన కిలాడీ, రామారావు ఆన్ డ్యూటీ సినిమాలు సైతం డిజాస్టర్లుగా మిగిలాయి. తాజాగా మాస్ మహారాజా రవితేజ నటించిన ధమాకా సినిమా మంచి ఫలితాన్ని అందుకోవడంతో మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కాడు మాస్ మహారాజా రవితేజ.ఈ సినిమా విడుదల ఎన్ని రోజులు కావస్తున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్స్ను అందుకుంటుంది. 

 మాస్ మహారాజా రవితేజ పర్ఫెక్ట్ మాస్ సినిమా తీస్తే ఖచ్చితంగా కాసుల వర్షం కురుస్తుంది అని మరోసారి నిరూపించుకున్నాడు. అయితే రవితేజ మొదట ఈ సినిమా ఇంత పెద్ద సక్సెస్ అవుతుంది అని అనుకోలేదట .ఇంతకుముందు ఆయన నటించిన రామారావు ఆన్ డ్యూటీ సినిమాకు రవితేజ పారితోషకం తీసుకోకుండా బిజినెస్ లో వాటా తీసుకోవాలని భావించాడు. దీనికిగాను ఆయన సొంత బ్యానర్ ఆర్టి టీం వర్క్స్ కూడా జత చేయడం జరిగింది. కానీ ఎవరు ఊహించిన విధంగా ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. అయితే దాని కంటే ముందు క్రాక్ సినిమా అప్పుడు కూడా రవితేజ కి రెమ్యూనరేషన్ కంటే డబుల్ ప్రాఫిట్ ఏ ఎక్కువ వచ్చింది.

దీంతో కిలాడి సినిమాకు కూడా కొంత షేర్ ను ఇవ్వాలని మాట్లాడుకున్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం రవితేజ ఒక్కో సినిమాకి ఎనిమిది కోట్లకు పైగానే రెమ్యూనికేషన్ తీసుకున్నట్లుగా తెలుస్తుంది.కానీ తాజాగా ఆయన నటించిన ధమాకా సినిమాకి మాత్రం అతను ఎలాంటి షేర్ ను కూడా తీసుకోలేదట. ఆ విషయంలో ఎలాంటి చర్చలు జరపకుండా సినిమా పూర్తి చేశాడట రవితేజ. కానీ ఎవరు ఊహించిన విధంగా ఇప్పుడు ఈ సినిమా కాసుల వర్షాన్ని కురిపిస్తుంది.ఈ సినిమాకి పెట్టిన పెట్టుబడి కంటే డబుల్ ప్రాఫిట్ వస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. దీంతో ఈ వార్త విన్న చాలా మంది రవితేజ ఈ సినిమాకి షేర్ డీల్ సెట్ చేసుకొని ఉంటే రెమ్యూనరేషన్ కంటే ఎక్కువ ఆయనకి షేర్ వచ్చేది అని కామెంట్లు చేస్తున్నారు. కానీ రవితేజ మాత్రం ముందు సినిమాలకు తీసుకున్న రిస్క్ ఈ సినిమాకి తీసుకోదలుచుకోలేదు అని అందుకే ఈ సినిమాకి గాను రవితేజ ఎలాంటి వాటా తీసుకోలేదు అని సమాచారం..!!

మరింత సమాచారం తెలుసుకోండి: