బిగ్ బాస్ రియాలిటీ షో మొదట హిందీ లో ప్రారంభం అయింది . ఆ తర్వాత ఈ రియాలిటీ షో ను ఇండియా లోని చాలా భాష లలో ప్రసారం చేయడం మొదలు పెట్టారు. అందులో భాగంగా తెలుగు భాషలో కూడా బిగ్ బాస్ రియాలిటీ షో ను ప్రసారం చేయడం మొదలు పెట్టారు. ఇప్పటి వరకు తెలుగు లో బిగ్ బాస్ రియాల్టీ షో 6 సీజన్ లను విజయవంతంగా పూర్తి చేసుకుంది . మరి ఈ 6 సీజన్  లలో ఏ సీజన్ కు ఎంత "టి ఆర్ పి" రేటింగ్ వచ్చిందో తెలుసు కుందాం.

బిగ్ బాస్ తెలుగు మొదటి సీజన్ కు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించాడు. ఈ సీజన్ కు 14.23 "టి ఆర్ పి" రేటింగ్ వచ్చింది.  బిగ్ బాస్ తెలుగు సీజన్ 2 కు నాచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరించాడు. ఈ సీజన్ కు 15.05 "టి ఆర్ పి" రేటింగ్ వచ్చింది.  బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 కి టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరించాడు.  


ఈ సీజన్ కు 18.29 "టి ఆర్ పి" రేటింగ్ వచ్చింది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 నాగార్జున హోస్ట్ గా వ్యవహరించాడు.  ఈ సీజన్ కు 19.51 "టి ఆర్ పి" రేటింగ్ వచ్చింది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 కు నాగార్జున హోస్ట్ గా వ్యవహరించాడు.  ఈ సీజన్ కు 16.04 "టి ఆర్ పి" రేటింగ్ దక్కింది.  బిగ్ బాస్ సీజన్ 6 కు నాగార్జున హోస్ట్ గా వ్యవహరించాడు. ఈ సీజన్ కు 18.17 "టి ఆర్ పి" రేటింగ్ వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: