తమిళ్ స్టార్ హీరో విజయ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తాజాగా విజయ్ వారసుడు సినిమాలో నటించిన సంగతి మన అందరికీ తెలిసిందే. ఇక సూపర్ స్టార్ విజయ్ హీరోగా నటించిన వారసుడు సినిమాసంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఇక ఈ సినిమాతో పాటు విజయ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేస్తున్నాడు.ఇక గతంలో విరుద్ధరి కాంబినేషన్ లో వచ్చిన మాస్టర్ సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుందో మనందరికీ తెలిసిందే.దీంతోపాటు ఇటీవల విక్రమ్ సినిమాతో కమలహాసన్ కి ఇండస్ట్రీ హిట్ ఇచ్చాడు లోకేష్. 

ఇంతటి బ్లాక్ బస్టర్ సినిమాలను అందిస్తున్న లోకేష్ కనకరాజ్ సినిమా కోసం   తమిళ ప్రేక్షకులే కాకుండా దేశవ్యాప్తంగా ఈయన సినిమాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఈయన అభిమానులు. అందుకే వీరిద్దరి కాంబినేషన్లో రాబోయే సినిమా కోసం ఎంతో ఎదురు చూస్తున్నారు అభిమానులు. అంతేకాదు వీరిద్దరి కాంబినేషన్లో రాబోయే సినిమాని పాన్ ఇండియా రేంజ్  లో విడుదల చేయాలని భావిస్తున్నారు. విడుదల చేయడమే కాకుండా వీరిద్దరి కాంబినేషన్లో రాబోయే సినిమా పాన్ ఇండియా స్థాయిలో మంచి విజయాన్ని అందుకుంటుంది అని అందరూ భావిస్తున్నారు.

అయితే ఈ సినిమాలో విజయ్ కి జోడిగా త్రిషను ఫిక్స్ చేసినట్లుగా గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి.అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో హీరోయిన్ గా త్రిషను తీసుకోవాల్సిందిగా స్వయంగా విజయ్ రికమండ్ చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే విజయ్ మాట్లాడుతూ.. ఆమెతో చాలా సంవత్సరాల తర్వాత నటిస్తున్నాను అంటూ చెప్పాడు. అయితే విజయ్ చెప్పడం వల్లే లోకేష్  విజయ్ కి జోడిగా ఈ సినిమాలో త్రిషను ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది. అయితే మొత్తానికి ఈ సినిమాలో విజయ్ కి జోడిగా త్రిష సెలెక్ట్ అయింది అని.. ఈ సినిమాకి త్రిష అయితే బాగా సెట్ అవుతుంది అని అందుకే విజయ్ త్రిషని ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: