టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును పొందాడు దేవి శ్రీ ప్రసాద్.ఎన్నో సినిమాలకు అద్భుతమైన సంగీతాన్ని అందించి ప్రస్తుతం వరుస సినిమాలకి మ్యూజిక్ను అందిస్తున్నాడు. అయితే తాజాగా దేవిశ్రీప్రసాద్ కెరియర్ ముగుస్తుంది తమన్ శకం మొదలవుతుంది అని అందరూ అనుకునే సమయంలో పుష్ప సినిమాతో అందరినీ ఒక్కసారిగా ఆశ్చర్యపరిచాడు.అయితే మొదట్లో బన్నీ నటించిన పుష్ప సినిమాలోని పాటలు మీద అనేక ట్రోలింగ్స్ కూడా రావడం జరిగింది. అనంతరం పుష్ప సినిమాలోని పాటలు క్రియేట్ చేసిన వండర్స్ అంతా ఇంతా కాదు. 

ఏకంగా పుష్ప సినిమాలోని పాటలు వరల్డ్ చాట్ బస్టాండ్ లిస్టులో నిలిచాయి. ప్రపంచవ్యాప్తంగా దేవిశ్రీప్రసాద్ పాటలను అందరూ మెచ్చుకున్నారు. అయితే పుష్ప సినిమాలోని పాటలు డిఎస్పీని ఇంతటి స్థాయిలో నిలబెట్టాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే తాజాగా కమలహాసన్ దేవి శ్రీ ప్రసాద్ కి ఒకసారి ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది.అయితే అది కూడా మ్యూజిక్ భాషలో. ఇక అదేంటన్నది అర్థం కాలేదు గానీ..డిఎస్పీ రాసిన ఒక ఎమోషనల్ పోస్ట్ ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. నా బిడ్డ ఇది నీ బిడ్డ అంటూ కమలహాసన్ సైన్ చేసిన ఒక నోట్ బుక్ ను డిఎస్పి తన సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశాడు.

దీనికిగాను డీఎస్పీ 2022 నుండి మరో మంచి మెమరీ అమెరికా నుంచి మన లోకనాయకుడు కమలహాసన్ సర్ నాకు ఈ గిఫ్ట్ని తీసుకొచ్చారు.. ఆయనకి నామీద ఉన్న ప్రేమతోనే ఇలాంటి అద్భుతమైన గిఫ్ట్ ని తీసుకొచ్చారు.. ఆయన స్వయంగా చేతితో తయారు చేసిన పుస్తకం ఇది.. అందులో నా మ్యూజిక్ కొటేషన్స్ మరియు కవర్ మీద ఆయన మాటలు దాంతోపాటు కమలహాసన్ దానిమీద సంతకం ఉన్నాయి.. ఇక అందులో నా బిడ్డ ఇది నీ అడ్డా అంటే మైకిడ్ దిస్ ఇస్ యువర్ అడ్డా అని అర్థం.. కమలహాసన్ గారు నాకోసం పుష్ప సినిమాలోని లైన్స్ ను ఇలా వాడారు.. ఇలా రాసినందుకు గాను నేను ఎంతో అదృష్టవంతుడిని.. నామీద మీకున్న ఈ నమ్మకాన్ని ప్రేమని చూపిస్తున్నందుకు చాలా సంతోషిస్తున్నాను సార్ అంటూ చెప్పుకొచ్చాడు డిఎస్పి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: