టాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్ ప్రస్తుత కాలంలో అగ్ర హీరోల సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. హీరో గానే కాకుండా ఇప్పుడు తన సెకండ్ ఇన్నింగ్స్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నరేష్ వరుస సినిమాలతో బిజీ అవుతున్నాడు. ఇక ఇదిలా ఉంటే గత కొంతకాలంగా నటి పవిత్ర లోకేష్ తో నరేష్ సన్నిహితంగా ఉంటున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే పవిత్ర లోకేష్ నీ తాను పెళ్లి చేసుకోబోతున్నట్లు డిసెంబర్ 31వ తేదీన సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించాడు ఈ సీనియర్ నటుడు. అంతేకాదు వాళ్ళిద్దరూ లిప్ కిస్ చేసుకుంటున్న వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి 2023 సంవత్సరానికి స్వాగతం పలుకుతున్నామంటూ పేర్కొనడం సంచలనంగా మారింది.

అయితే ఇప్పటివరకు పెళ్లి గురించి స్పష్టత ఇవ్వని ఈ జంట ఇప్పుడు పెళ్లి చేసుకోబోతున్నామంటూ  ప్రకటించడంతో వీరి గురించి ఇండస్ట్రీలో అనేక రకాల చర్చలు జరుగుతున్నాయి. ఇక మరోవైపు నరేష్ తన మూడో భార్యకు విడాకులు ఇవ్వడానికి సిద్ధమయ్యాడని.. ఆమె కూడా అందుకు అంగీకరించడంతో పవిత్ర లోకేష్ ను పెళ్లి చేసుకోవడానికి రెడీ అయినట్లుగా వార్తలు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో నరేష్ మూడో భార్య రమ్య మొదటిసారిగా మీడియా ముందుకు వచ్చారు. ఈ మేరకు నరేష్ పవిత్ర లిప్ లాక్ వీడియో మీద మీరు కంగారు పడుతున్నారని తెలిసిందని యాంకర్ పేర్కొనగా.. దానికి నరేష్ భార్య స్పందిస్తూ..' ఇది మీకు కొత్త ఏమో? కానీ నాకు మాత్రం కొత్త కాదని  పేర్కొన్నారు.

తాను ఇప్పటికే నరేష్ మీద ఆరోపణలు చేశానని దానికి సంబంధించిన సాక్షాలను కన్నడ మీడియా ముందు పెట్టానని తెలిపింది.అంతేకాకుండా తాను ఇప్పుడు మీడియా ముందుకు రావడానికి ఓ బలమైన కారణం ఉందని చెప్పింది. కొన్ని మీడియా ఛానల్స్ లో మా ఇద్దరికీ విడాకులు అయిపోయాయని ప్రచారం చేస్తున్నారు. కానీ అందులో ఎలాంటి నిజం లేదు. ప్రస్తుతం మా విడాకులకు సంబంధించిన కేసు కోర్టులో నడుస్తోంది. అంతేకాకుండా విడాకులు కావాలని నేను కోరలేదు. నా నుండి విడాకులు కావాలని నరేష్ కోరాడని పేర్కొంది రమ్య. మొత్తం మీద నరేష్ పవిత్ర నిజంగానే పెళ్లి చేసుకోబోతున్నారా? లేక ఇది ప్రమోషన్స్ స్టంటా? అనేది తెలియాలంటే దీనిపై పూర్తి స్పష్టత వచ్చేంతవరకు వేచి చూడాల్సిందే...!!

మరింత సమాచారం తెలుసుకోండి: